Pushpa 2: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. పుష్ప 2 సినిమాను ఫ్రీగా చూసే ఛాన్స్? ఇందులో ఆర్డర్ చేస్తే చాలు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 దిరూల్. మూడేళ్ల క్రితం రిలీజై సంచలనం సృష్టించిన పుష్ఫ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pushpa 2: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. పుష్ప 2 సినిమాను ఫ్రీగా చూసే ఛాన్స్? ఇందులో ఆర్డర్ చేస్తే చాలు..
Pushpa 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 24, 2024 | 9:20 PM

‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్లు ఊపందుకున్నాయి.ఓవైపు యూట్యూబ్ లో ట్రైలర్ దుమ్ము రేపుతోంది. అలాగే టైటిల్ సాంగ్ కూడా హిట్ అయ్యింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్ కిస్సిక్ ను కూడా విడుదల చేశారు. ఆదివారం (నవంబర్ 24) ఈ పాటను చెన్నైలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట అన్ని చోట్లా ట్రెండింగ్ అవుతోంది. ఈ సంగతి పక్కన పెడితే ఇప్పటికే ఓవర్సీస్ లో పుష్ఫ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దీంతో ఇండియాలో కూడా ఎప్పుడు పుష్ఫ 2 బుకింగ్స్ స్టార్ట్ అవుతాయా అని మూవీ లవర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోన పుష్ఫ 2 సినిమాకు ఉన్న క్రేజ్ ను వాడుకునేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ బ్లింక్ ఇట్ మూవీ లవర్స్ కు ఒక బంపరాఫర్ ప్రకటించింది. త‌మ యాప్‌లో కిరాణా సామాన్లు కొనుకున్న‌వారికి పుష్ప 2 టికెట్ వోచ‌ర్స్ ఉచితంగా ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ఇక్కడే ఒక మెలిక పెట్టింది. అదేంటటే.. రూ.999 కంటే ఎక్కువ ఆర్డ‌ర్ చేస్తేనే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. ఈ ఆఫ‌ర్ నవంబ‌ర్ 23 నుంచి న‌వంబ‌ర్ 29 వ‌రకు మాత్రమే ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది.

కాగా అల్లు అర్జున్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ మూవీ. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక సినిమా ప్రమోషన్లు పబ్లిసిటీ కోసం భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు.. డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా ‘పుష్ప 2’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లకు పైగానే జరిగిందని ప్రచారం జరుగుతోంది. పైగా గతంలో ఏ భారతీయ సినిమాకు లేని విధంగా పెద్ద ఎత్తున పుష్ఫ 2 సినిమాను రిలీజ్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాబట్టి మొదటి రోజే కలెక్షన్ల పరంగా పుష్ప 2 రికార్డులు సృష్టించే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

బ్లింకిట్ యాప్ ట్వీట్..

చెన్నై ఈ వెంట్ లో అల్లు అర్జున్ ఎంట్రీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.