AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: భార్య షాలిని పుట్టినరోజు.. లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన అజిత్.. ఫోటోస్ వైరల్..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళ చిత్రసీమలో ప్రముఖ నటులలో ఒకరు. అజిత్ తన తోటి నటి షాలినిని 2000లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత షాలిని పూర్తిగా సినిమాలకు దూరమైంది. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ జంటలలో అజిత్, షాలిని జోడి ఒకటి. తాజాగా తన భార్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు అజిత్.

Ajith Kumar: భార్య షాలిని పుట్టినరోజు.. లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన అజిత్.. ఫోటోస్ వైరల్..
Ajith
Rajitha Chanti
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 25, 2024 | 9:14 PM

Share

తమిళ చిత్రాల్లో కలిసి నటించి ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు హీరో అజిత్, షాలిని. వీరి జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ సైతం ఉంది. ఇప్పటివరకు తమిళ చిత్రపరిశ్రమలో అన్యోన్యంగా ఎలాంటి రూమర్స్ రాకుండా ఉన్న జంటలలో అజిత్, షాలిని జంట కూడా ఒకటి. అజిత్ తన భార్య షాలిని పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు. నటుడు అజిత్ కుమార్ నవంబర్ 20న తన భార్య షాలిని పుట్టినరోజు కానుకగా ఖరీదైన లెక్సస్ కారును అందించాడు. ఆ లెక్సస్ కారుతో నటి షాలిని ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అమర్కలం చిత్రం ద్వారా సినీ జంటగా అలరించిన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. షాలిని ఊమాకుయిల్ సినిమాతో బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. 1997లో నటుడు విజయ్ సరసన కాదలుకు మర్ష్య అనే చిత్రంలో కథానాయికగా మారింది. 1999లో శరణ్ దర్శకత్వం వహించిన ‘అమర్కలం’ చిత్రంలో నటుడు అజిత్ సరసన నటించింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

ఆ తర్వాత వీరిద్దరు 2000 ఏప్రిల్ 24న వివాహం చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. పెళ్లి తర్వాత షాలిని పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే అజిత్ సోషల్ మీడియాకు దూరం. కానీ షాలిని మాత్రం అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రంలో నటిస్తున్నాడు అజిత్.. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.