AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 11 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ లవర్ బాయ్.. ఇప్పుడేలా ఉన్నాడంటే..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలిన హీరోస్ చాలా మంది ఉన్నారు. రొమాంటిక్ ప్రేమకథలతో దక్షిణాదిలో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. గ్లామర్, స్టైల్, మ్యానరిజంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిల హృదయాలు దొచుకున్నారు. ఇక ఇప్పుడు 11 ఏళ్లకు తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 11 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ లవర్ బాయ్.. ఇప్పుడేలా ఉన్నాడంటే..
Abbas
Rajitha Chanti
|

Updated on: Mar 21, 2026 | 12:30 PM

Share

90వ దశకంలో దక్షిణాదిని ఊపేసిన లవర్ బాయ్స్ చాలా మంది ఉన్నారు. అందమైన ప్రేమకథలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అందులో ఈ హీరో ఒకరు. అప్పట్లో ఆయన హెయిల్ స్టైల్, లుక్, మ్యనరిజం కు అమ్మాయిల్లో ఓ రేంజ్ క్రేజ్ ఉండేది. హీరోగా మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత సినిమాల ఎంపికలో చేసిన పొరపాట్లు నెమ్మదిగా కెరీర క్లోజ్ అయ్యింది. హీరోగా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే సెకండ్ హీరోగా.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు. అప్పట్లో చాక్లెట్ బాయ్ ట్యాగ్ తెచ్చుకున్న అతడు.. స్టా్ర్ హీరోలకే పోటీ ఇచ్చాడు. అతడు మరెవరో కాదు.. హీరో అబ్బా్స్. 90’s యూత్, కిడ్స్ ఈ హీరోను ఠక్కున గుర్తుపట్టేస్తారు.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

అబ్బాస్.. 1996లో విడుదలైన ప్రేమ దేశం సినిమాతో హీరోగా వెండితెరకు పరిచమయయ్యారు. డైరెక్టర్ కదిర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు యూత్ లో మంచి ఫేమ్ తెచ్చిపెట్టాయి. అప్పట్లో కుర్రాళ్లందరూ అబ్బాస్ లాగే జుట్టు పెంచి ఆయనలాగే డ్రెస్సింగ్ స్టైల్ అనుసరించారు. తక్కువ సమయంలోనే తిరుగులేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించారు. అలాగే కెరీర్ ఫాంలో ఉన్నప్పుడే సెకండ్ హీరోగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

ఆ తర్వాత నెమ్మదిగా అతడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన అబ్బాస్.. ఆ తర్వాత కేవలం హార్పిక్ యాడ్ లోనే కనిపించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నారు. 2015లో పచ్చక్కల్లం సినిమాలో చివరిసారిగా కనిపించారు. తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. ప్రస్తుం జీవీ ప్రకాష్ నటిస్తున్న హ్యాపీ రాజ్ అనే తమిళ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు అబ్బా్స్. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

View this post on Instagram

A post shared by Abbas Ali (@iamactorabbas)

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us