Bigg Boss Maanas: బ్రహ్మముడి మానస్ కుమారుడి నామకరణ మహోత్సవం.. ఏం పేరు పెట్టారో తెలుసా?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బ్రహ్మముడి సీరియల్ నటుడు మానస్ నాగుల పల్లి కొన్ని రోజుల క్రితమే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని సతీమణి శ్రీజ.. మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ కుమారుడి నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మానస్ దంపతులు

Bigg Boss Maanas: బ్రహ్మముడి మానస్ కుమారుడి నామకరణ మహోత్సవం.. ఏం పేరు పెట్టారో తెలుసా?
Bigg Boss Maanas
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2024 | 2:21 PM

బిగ్ బాస్ ఫేమ్, బ్రహ్మముడి సీరియల్ రాజ్ అలియాస్ మానస్ నాగుల పల్లి ఇటీవలే తండ్రయ్యాడు. సెప్టెంబర్ 10న అతని సతీమణి శ్రీజ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మానస్ దంపతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా తమ కుమారుడి నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు మానస్ దంపతులు. ఈ సందర్భంగా తమ బిడ్డకు ధ్రువ నాగుల పల్లి అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మానస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. అలాగే కుమారుడి నామకరణ మహోత్సవం ఫొటోలను కూడా పంచుకున్నాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మానస్-శ్రీజ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

గత ఏడాది నవంబర్ లో మానస్, శ్రీజల వివాహం సింపుల్ గా జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. తమ దాంపత్య బంధానికి ప్రతీకగా ఈ ఏడాది సెప్టెంబర్ లో తమ జీవితంలోకి ఒక పండంటి బిడ్డను ఆహ్వానించారీ లవ్లీ కపుల్.ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన మానస్ బ్రహ్మముడి సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ ధారావాహికలో అతను పోషించిన రాజ్ పాత్ర కు బాగా పేరొచ్చింది. ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతోన్న సీరియల్స్ లో బ్రహ్మముడి కూడా ఒకటి.

మానస్ కుమారుడి నామకరణ మహోత్సవం ఫొటోస్..

అంతకు ముందు ‘కోయిలమ్మ’, ‘మనసిచ్చిచూడు’ వంటి సీరియల్స్‌తోనూ బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు మానస్. అలాగే తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లోనూ అడుగు పెట్టి గ్రాండ్ ఫినాలే దాకా చేుకున్నాడు. ఇక కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో హీరోగా, సహాయక నటుడిగా మెప్పించాడు మానస్. కాయ్‌ రాజా కాయ్‌, ప్రేమికుడు తదితర చిత్రాల్లో హీరోగా మెప్పించిన మానస్. అలాగే రక్షణ, సోడా గోలి సోడా, గ్యాంగ్స్ ఆఫ్ గబ్బర్ సింగ్ మూవీస్ లోనూ స్పెషల్ రోల్స్ చేశాడు.

శ్రీజ సీమంతం వేడుక.. వీడియో

 మానస్ నాగుల పల్లి – శ్రీజ రొమాంటిక్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.