Brahmamudi, November 26th Episode: ఎందుకూ పనికి రావంటూ పిల్లకాకి అవమానం.. అపర్ణ ప్రయత్నం ప్లాప్!
కావ్యని ఇంటికి తీసుకెళ్లేందుకు రాజ్ నిరాకరిస్తాడు. ఇంటికి వచ్చిన రాజ్‌ని సుభాష్ నిలదీస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్, అప్పూలు పానీ పూరి తిండుగా.. అనామిక వచ్చి ఘోరంగా అవమానిస్తుంది. నువ్వు ఎందుకూ పనికి రావని హేళన చేస్తుంది. ఇంకోవైపు ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఇంటిని పట్టించుకునేవాళ్లు ఎవరూ లేరని.. మీ పిన్ని వేరే కుపంటి పెట్టుకుని తన వంట తాను చేసుకుంటుంది కదా.. అని ప్రకాశం అంటాడు. నేనేం ఒళ్లు పొగరెక్కి ఇలా చేయడం లేదు. కళ్యాణ్ కోసమే కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇలా వీళ్లిద్దరూ మాటా మాటా అనుకుంటూ ఉంటారు. కాసేపు మీ గొడవ ఆపండి. ఓరేయ్ రాజ్ ఇవన్నీ అనవసరం. ముందు నువ్వు వెళ్లి మీ మమ్మీని తీసుకొస్తావా లేదా అని సుభాష్ అడిగితే.. ఎలా తీసుకొస్తాను డాడ్.. ఫెస్టివల్‌కి ఆఫర్ ఇచ్చినట్టు 1+1 ఆఫర్ కింద ఆ కళావతిని కూడా ఇంటికి తీసుకు రావాల్సిందని రాజ్ అంటాడు. తీసుకు రావాల్సింది.. మీ తాతయ్య కోరుకున్నది కూడా అదే కదా.. మీ అమ్మ కోరుకునేది కూడా అదే.. జీవితాంతం తనని అక్కడే వదిలేస్తావా.. అని సుభాష్ అడిగితే.. నన్ను కాదు మమ్మీని ఫోన్ చేసి అడగండి. మీరందరూ అడగారు.. నేను వెళ్లాను. మామ్ రానని చెప్పేసింది. ఇక నేను చెప్పేది ఏమీ లేదని రాజ్ అనేసి వెళ్లిపోతాడు.
వాడు నన్నూ, కావ్యని తీసుకొస్తాడు..
ఆ తర్వాత సుభాష్ అపర్ణకు ఫోన్ చేసి.. నువ్వు ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగింది. ఇప్పుడు ఏం చేస్తావ్? అని సుభాష్ అడిగితే.. అనుకున్నవి అన్నీ వెంటనే జరిగితే జీవితం కాదు కదా.. మరో రెండు రోజుల్లో వాడి తప్పు వాడు తెలుసుకుని నన్నూ, కావ్యని తీసుకొస్తాడని అపర్ణ అంటుంది. నాకు ఆ నమ్మకం లేదని సుభాష్ అంటాడు. ఇక అక్కడే ఉన్న కావ్య అంతా విని.. తప్పు చేస్తున్నారని అంటుంది. అయితే ఏంటి ఇప్పుడు అని అపర్ణ అడిగితే.. మీ అబ్బాయితో కలిసి వెళ్లిపోవాల్సింది. వృథా ప్రయత్నం చేస్తున్నారని కావ్య అంటుంది. నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నా నీకెందుకు.. నోరు మూసుకుని వెళ్లి చికెన్ వండు.. నీ చేతి వంట తిని చాలా రోజులు అయిపోయిందని అపర్ణ అంటుంది. మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడే బాగుండేది. ప్రేమగా మాట్లాడేవారు.. ఇక్కడికి వచ్చిన కాన్నుంచి తెగ అరిచేస్తున్నారని కావ్య అంటుంది. ప్రేమగా మాట్లాడితే ఇదిగో మీ కాపురాన్ని ఇలా చేశారు.. అందుకే ఇక నుంచి చెప్పడాలు లేవు.. అరవడాలే అని అపర్ణ అంటుంది.
రుద్రాణి పుల్ల..
ఆ నెక్ట్స్.. ధాన్యలక్ష్మి ఒక్కర్దే బయట కూర్చొని ఆలోచిస్తూ ఉండగా.. రుద్రాణి వస్తుంది. నువ్వు ఇక్కడ కూర్చొని బాధ పడినా ప్రయోజనం ఏముంది? వాడు ఆటో నడపడం తప్పదని రుద్రాణి అంటే.. అందుకే వేరే కుంపటి పెట్టానని ధాన్యలక్ష్మి అంటే.. పెట్టి ఏం చేశావ్.. నిన్ను ఎవరైనా పట్టించుకుంటున్నారా.. టైమ్ కావాలని తప్పించుకున్నారు. అదే కావ్యని ఆఫీస్ నుంచి తప్పించగానే.. మా వదిన పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ కూర్చుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్లందరూ గురించి కావ్య గురించి ఆలోచిస్తున్నారు. కానీ కళ్యాణ్ గురించి మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఎవర్నో ఒకర్ని నీ వైపుకు తిప్పుకో.. నీ మాట వినేలా చేయమని రుద్రాణి సలహా ఇస్తుంది.
నువ్వు ఎందుకూ పనికి రావు.. కళ్యాణ్‌ని అవమానించిన అనామిక..
ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ, కళ్యాణ్‌లు ఇద్దరూ కలిసి నడుచుకుంటూ కోచింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే ఉన్న పానీ పూరీని చూపించి తినాలి అని అడుగుతుంది అప్పూ. ఇక ఇద్దరూ కలిసి ఇద్దరూ వెళ్లి తింటూ ఉండగా.. అటుగా వెళ్తున్న అనామిక కారు ఆపి కళ్యాణ్ వాళ్ల దగ్గరకు వస్తుంది. నేను అనుకున్నట్టుగానే రోడ్డు మీద పడ్డారు అన్నమాట అని అంటుంది. మనుషులు అన్నాక రోడ్డు మీదనే తిరుగుతారని అప్పూ అంటే.. రోడ్డు మీద తిరగడానికి.. రోడ్డు మీద పడటానికి చాలా తేడా ఉందని అనామిక అంటే.. నీకేం సమస్యా అని అప్పూ అంటే.. మీకే సమస్యలు ఉన్నట్టు ఉన్నాయి.. ఇలా రోడ్డు పక్కన దొరికేవి తింటూ అని అనామిక అంటే.. ఎక్కడ తిన్నా నీ ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ లేదు కదా అని అప్పూ అంటుంది. నేను మీకు సహాయం చేద్దామని వచ్చా.. ఖర్చులకు ఏమన్నా డబ్బులు కావాలా.. నిన్ను నమ్ముకుంటే నన్ను కూడా ఇలాగే నిలబడతావని.. బయటకు వచ్చా.. నిన్ను ప్రేమించుకున్నందుకు పాపం గప్ చుప్‌లతో సరి పెట్టుకుంటుందని కావాలనే అనామిక రెచ్చగొడుతుంది. నువ్వు ఇప్పటికే ఎక్కువగా మాట్లాడవు.. ఇక్కడే ఉంటే నిన్ను అని అంటూ అప్పూ అంటుండగా.. కళ్యాణ్ ఆపుతాడు.
మీరు దిట్టంగానే ఉన్నారు కదా.. చేసుకోండి..
ఆ తర్వాత స్వప్నకు పనిమనిషి శాంతా వచ్చి జ్యూస్ ఇస్తుంది. అప్పుడే రుద్రాణి వచ్చి మమ్మల్ని కూడా కాస్త పట్టించుకోమని అంటుంది. సరేనమ్మా మీ చీర కలర్ కాస్త ఓవర్ అయిందని అంటుంది పనిమనిషి. నీకు కూడా చాలా ఓవర్ అయిందని రుద్రాణి అంటుంది. ఉదయం నుంచి కనీసం నాకు కాఫీ, టీ అయినా ఇచ్చావా.. అని రుద్రాణి అడిగితే.. టీ, టిఫిన్ పెట్టేటప్పుడు మీరు కనిపించలేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని శాంతా అడిగితే.. గదిలోకి వచ్చి ఏం కావాలో అడగాలి కదా అని రుద్రాణి అంటుంది. మీకేంటి చాలా దిట్టంగా ఉన్నారు కదా అని శాంతా అంటే.. పైకి అలా కనిపించినా.. లోపల ఎన్నో రోగాలు ఉన్నాయని స్వప్న కావాలని అంటుంది. అమ్మా ఏం కావాలి అని శాంతా అడిగితే.. రాత్రి డిన్నర్‌లోకి నాకూ రాహుల్‌కి చికెన్ ఫ్రై, చికెన్ 65, ఎగ్ మసాలా చేయమని అంటుంది. అన్ని వంటలు అయితే నేను చేయలేను అమ్మా.. ఒక్కర్దాన్నే అన్ని పనులు ఎలా చేస్తాను. అప్పుడంటే కావ్య అమ్మ సహాయం చేసేది కాబట్టి.. చేసేదాన్ని.. ఇప్పుడు మీరేమన్నా సహాయం చేస్తారా అని పని మనిషి అంటుంది. ఏంటే నేను చేయాలా.. చేయకపోతే పనిలో నుంచి పీకి పారేస్తానని రుద్రాణి అంటుంది. ఈ మాట ఎప్పుడు అంటారా అని చూస్తున్నా.. నేను మానేస్తానని పని మనిషి అంటుంది.
రాజ్ గదిలో సుభాష్..
ఆ తర్వాత రాజ్ నిద్రపోతూ ఉండగా.. సుభాష్ వచ్చి తలుపు తడతాడు. సుభాష్ దిండు, దుప్పటితో వచ్చి.. రాజ్ గదిలో పడుకుంటాడు. అదేంటి ఇక్కడకి వచ్చారు.. మీ బెడ్ రూమ్ ఉంది కదా అని రాజ్ అంటే.. పెళ్లైన దగ్గర్నుంచీ నేనూ, మీ మమ్మీ ఆ గదిలోనే ఉండే వాడిని. ఇప్పుడు మీ అమ్మ లేకపోతే.. అక్కడ నిద్ర పడటం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. నీకు నచ్చకపోతే చెప్పు మా నాన్న గదికి వెళ్తానని సుభాష్ అంటే.. అవసరం లేదు వచ్చి పడుకోమని చెప్తాడు రాజ్. ఆ నెక్ట్స్.. ప్రకాశం వచ్చి నిద్రపోతుండగా.. నిద్రపోకుండా ఏం చేస్తున్నావ్.. స్వీట్స్ ఏమన్నా ఉంటే తీసుకురా.. ఏదన్నా తినాలనిపిస్తుందని అంటాడు. నా రక్త తాగండి.. కావ్యని ఈ ఇంటికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మీకు కొద్దిగా కూడా బాధ అనిపించడం లేదా.. కళ్యాణ్‌ని ఈ ఇంటికి తీసుకు రావాలని లేదా మీకు? అని ధాన్యలక్ష్మి అంటే.. తీసుకొచ్చినా.. అవమానించి నువ్వు పంపించేస్తున్నావు కదా అందుకే.. ఆ ఆలోచన మానుకున్నానని ప్రకాశం అంటాడు. ఏమీ లేదు కానీ మీరు వెళ్లి ఆస్తి విషయం మాట్లాడమని ధాన్యలక్ష్మి అడిగితే.. నేను మాట్లాడనని ప్రకాశం అంటాడు. దీంతో దిండు, దుప్పటి ఇచ్చి బయటకు పంపించేస్తుంది ధాన్యలక్ష్మి. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..