Telangana: ఇది కదా ప్రజల వద్దకు పాలన అంటే.. పంట పొలాల్లో తిరుగుతూ.. రైతులతో మమేకమైన జిల్లా కలెక్టర్

తన దృష్టికి వచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి స్వయంగా రంగంలోకి దిగారు ఖమ్మం జిల్లా కలెక్టర ముజ్మిల్ ఖాన్. ఏకంగా రైతు అవతారమెత్తి, పంటపొలాల బాట పడ్డారు.

Telangana: ఇది కదా ప్రజల వద్దకు పాలన అంటే.. పంట పొలాల్లో తిరుగుతూ.. రైతులతో మమేకమైన జిల్లా కలెక్టర్
Khammam Collector Muzammil Khan
Follow us
N Narayana Rao

| Edited By: Balaraju Goud

Updated on: Nov 26, 2024 | 3:06 PM

జిల్లా పాలన అధికారి అంటే జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలను పర్యవేక్షిస్తూ ఆయా శాఖలను ప్రజలకు చేరువ చేసేవారు. ప్రజలకు జవాబుదారీతనంగా సేవ చేస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరించేలా చర్య చర్యలు తీసుకుంటూ నిత్యం బిజీగా ఉంటారు. అయితే ఈ జిల్లా కలెక్టర్ కొంచెం డిఫెరెంట్. విధి నిర్వహణలో భాగమైన ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో తానే స్వయంగా పాల్గొంటారు. ప్రజల నుంచి అర్జీలను (దరఖాస్తులను) స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజలు, రైతులు తన దృష్టికి సమస్య తీసుకువస్తే చాలు వాటిని తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వవచ్చు కానీ ఈ కలెక్టర్ ఈ కలెక్టర్ అలా కాదు.. సమస్య ఉందని వినతి పత్రాలు తీసుకునే వచ్చే ప్రజల్ని ఓపిగ్గా వారి సమస్య విని.. వికలాంగులు ఉంటే.. నేలపై కూర్చొని వారి సమస్యలు వింటారు. హాస్టల్స్, అంగన్‌వాడి సెంటర్, స్కూల్స్ సందర్శించి పిల్లలతో మమేకమవుతారు.. స్టూడెంట్‌గా పాఠాలు వింటారు. ఉపాధ్యాయుడు పాత్రలో వారికి పాఠాలు బోధిస్తారు.క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి వాటిని పరిష్కరిస్తున్నారు.ఆయనే ఖమ్మం జిల్లా కలెక్టర ముజ్మిల్ ఖాన్. తన పనితీరు ,వ్యక్తిత్వం తో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు ఈ కలెక్టర్..

తాజాగా తన దృష్టికి వచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి స్వయంగా రంగంలోకి దిగారు ఖమ్మం జిల్లా కలెక్టర ముజ్మిల్ ఖాన్. ఏకంగా రైతు అవతారమెత్తి, పంటపొలాల బాట పడ్డారు. ఈక్రమంలోనే వరి పంట కోతను పరిశీలించి, పొలం గట్టున రైతులతో కూర్చొని పంట దిగుబడి, వ్యవసాయ వివరాలను, సమస్యల గురించి రైతులతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడి ఆరా తీశారు.

ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ పర్యటించారు. మంగాపురం రోడ్డులో పొలాల్లో కలియతిరుగుతూ.. జరుగుతున్న వరి పంట కోతలను పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా వరి కోతల మిషన్‌పై కలెక్టర్ కూర్చొని వరి కోత కోయించారు. ధాన్యం పంట విస్తీర్ణం, వస్తున్న దిగుబడి, కొనుగోలు ప్రక్రియ ఎలా జరుగుతుంది, ధాన్యం డబ్బులు సకాలంలో వస్తున్నాయా, రైస్ మిల్లర్ల దగ్గర ఏదైనా కోతలు జరుగుతున్నాయా, అధికారుల స్పందన వంటి వివరాలను తెలుసుకున్నారు.

వరి కోతల యంత్రం తమిళనాడు నుంచి వచ్చిందని తెలుసుకున్న కలెక్టర్ గంట సమయానికి ఎంత విస్తీర్ణంలో పంట కోత జరుగుతుంది, ఎంత డబ్బులు వస్తాయి వంటి వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రైతు పొలంలో గట్టుపై రైతులతో కూర్చొని మాట్లాడారు. సాగు నీటి వసతి, విద్యుత్ సమస్యలపై ఆరా తీశారు. గ్రామాలలో త్రాగు నీటి సరఫరాకు సంబంధించి అంశాలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా జిల్లా కలెక్టరే తమ దగ్గరకు వచ్చి తమ సమస్యలు తెలుసుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

సినిమా ఛాన్సులు రాక దొంగగా మారి..దీన స్థితిలో కన్నుమూసిన కులశేఖర్
సినిమా ఛాన్సులు రాక దొంగగా మారి..దీన స్థితిలో కన్నుమూసిన కులశేఖర్
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
'సెకండ్‌ హ్యాండ్‌ ట్యాగ్‌ ఎందుకు వేస్తారు'.. ఎమోషనల్‌ అయిన సమంత
'సెకండ్‌ హ్యాండ్‌ ట్యాగ్‌ ఎందుకు వేస్తారు'.. ఎమోషనల్‌ అయిన సమంత
10 ఏళ్లలో రైల్వే శాఖలో 5లక్షల ఉద్యోగాలిచ్చాం: అశ్విని వైష్ణవ్
10 ఏళ్లలో రైల్వే శాఖలో 5లక్షల ఉద్యోగాలిచ్చాం: అశ్విని వైష్ణవ్
వైజాగ్‌లో ఆకాశాన్ని తాకేలా అల్లు అర్జున్ కటౌట్.. వీడియో ఇదిగో
వైజాగ్‌లో ఆకాశాన్ని తాకేలా అల్లు అర్జున్ కటౌట్.. వీడియో ఇదిగో
నిరుద్యోగులకు పండగే.. ఈ రంగంలో లక్ష ఉద్యోగాలు రానున్నాయి..
నిరుద్యోగులకు పండగే.. ఈ రంగంలో లక్ష ఉద్యోగాలు రానున్నాయి..
రూల్స్ బ్రేక్ చేస్తున్న నయనతార.! ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్..
రూల్స్ బ్రేక్ చేస్తున్న నయనతార.! ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్..
భారత్‌లో రికార్డ్‌ సృష్టిస్తున్న యాపిల్‌ కంపెనీ..
భారత్‌లో రికార్డ్‌ సృష్టిస్తున్న యాపిల్‌ కంపెనీ..
బాలయ్యతో వన్స్‌మోర్.. ఆహా అన్‌స్టాపబుల్‌లో శ్రీలీల..
బాలయ్యతో వన్స్‌మోర్.. ఆహా అన్‌స్టాపబుల్‌లో శ్రీలీల..
సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు.. వివాహితతో అక్రమ సంబంధం?
సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు.. వివాహితతో అక్రమ సంబంధం?
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.