AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 18నెలల కూతురుతో కలిసి తండ్రి ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

18నెలల చిన్నారితో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కూతుర్లు ఇద్దరు చనిపోగా ఇప్పుడు ఆయన రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టిస్తుంది.

Telangana: 18నెలల కూతురుతో కలిసి తండ్రి ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Young Man Suicide
Diwakar P
| Edited By: |

Updated on: Nov 26, 2024 | 3:29 PM

Share

కళ్ళ ముందే తన కూతురు, భార్య అనారోగ్యంతో బాధపడడం చూడలేకపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన 18 నెలల కూతురుతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మానసికస్థితి బాగాలేని ఆ చిన్నారితో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కూతుర్లు ఇద్దరు చనిపోగా ఇప్పుడు ఆయన రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఒకవైపు అప్పులు, మరోవైపు అనారోగ్య సమస్యలు తాళలేక చనిపోతున్నానని, మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని తన భార్యకు సూచిస్తూ సూసైడ్ నోట్ రాశాడా వ్యక్తి. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

అప్పుల బాధ, భార్య, కుమార్తె ఆరోగ్య సమస్యల వల్ల జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి, తన కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు క్రాంతి అనే వ్యక్తి.ఈ విషాదకర ఘటన సోమవారం(నవంబర్ 25) తెల్లవారుజామున ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాజుల్‌పేట్ బోయిగల్లీకి చెందిన రఘుపతి క్రాంతి(35), మానస దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 18 నెలల పెద్దకూతురు, నెల రోజుల చిన్న కూతురు ఉన్నారు. క్రాంతి ధర్మారంలోని గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్ ద్వారా అటెండర్‌గా పనిచేస్తున్నాడు. అతని పెద్ద కూతురు నేహ(18నెలలు) పుట్టినప్పటి నుంచి మెదడు సమస్యతో బాధపడుతోంది. మరోవైపు భార్య మానసకు కూడా ఇటీవలే గుండె సంబంధిత వ్యాధి వచ్చింది. భార్యకు గుండె ఆపరేషన్ కూడా చేయించాడు. వీరి వైద్యం కోసం క్రాంతి అప్పుల పాలు అయ్యాడు.

అయితే జీవితంపై విరక్తి చెందిన క్రాంతి, కూతురు నేహాతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రాంతి, నేహా మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. బైక్‌పై వచ్చి న్యాల్‌కల్ చెరువులో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడ లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో క్రాంతి తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించిన తీరు అందరిని కలిచివేస్తోంది.

ఆదివారం(నవంబర్ 24) తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన క్రాంతి ఉదయం అందరూ నిద్రిస్తున్న సమయంలో తన పెద్ద కూతురు నేహాను తీసుకుని వెళ్ళాడు. న్యాల్కల్ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన ఆర్థిక పరిస్థితి భార్య, కూతురు అనారోగ్య సమస్యల వల్లే తాను చనిపోతున్నానని రాసుకొచ్చాడు. అంతేకాకుండా భార్య మానస వేరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని తనను నిందించే ఉద్దేశం లేదని ఈ సూసైడ్ నోటు ఎవరికి చూపించద్దని అందులో పేర్కొన్నాడు. క్రాంతి ఆత్మహత్యతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతదేహాన్ని క్రాంతి మృతదేహాన్ని చెరువులు నుంచి వెలికి తీసే పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. విగతజీవిగా మారిన తండ్రి కూతుళ్లను చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా పోలీసులు సూసైడ్ నోట్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..