AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. అప్పుడే దూసుకొచ్చిన వందేభారత్.. కట్‌చేస్తే..

కేరళలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఫుల్‌గా మందుతాగిని ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులతో తన ఆటోను రైల్వే పట్టాలపై వదిలేసి వెల్లిపోయాడు. అదే సమయంలో కాసర్గోడ్ నుండి వస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లోకోపైలల్‌ ట్రాక్‌పై ఆటో ఉండడాన్ని గమనించి సడ్‌న్ బ్రేక్‌ వేశాడు. దీంతో పెనుప్రమాదం తప్పింది.

ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. అప్పుడే దూసుకొచ్చిన వందేభారత్.. కట్‌చేస్తే..
Drunk Auto Driver Leaves Vehicle On Tracks
Anand T
|

Updated on: Dec 24, 2025 | 4:16 PM

Share

ఫుల్‌గా తాగి మద్యం మత్తులో తన ఆటోను ఓ డ్రైవర్ రైల్వే పట్టాలపై వదిలేసి వెళ్లిన ఘటన కేరళలోని తిరువనంతపురం సమీపంలో వెలుగు చూసింది. అదే సమయంలో అటుగా వస్తున్న వందేభారత్ ట్రైన్ లోకోపైలట్‌ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. లోకోపైలట్ సమాచారంతో ఘటనా స్థలానికి చేరకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు ఆటోను ట్రాక్‌పై నుంచి తొలగించారు.

వివరాల్లోకి వెళ్తే.. కాసర్‌గోడ్ నుండి తిరువనంతపురం వెళ్తున్న వందేభారత్ రైలు మంగళవారం రాత్రి 10.10 గంటల ప్రాంతంలో వర్కల-కడక్కవూర్ సెక్షన్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే ట్రైన్ అకటుమూరి వద్దకు రాగానే ట్రాక్‌పై ఆటో ఉండటాన్ని లోకోపైలట్ గమనించాడు. దీంతో వెంటనే అప్రమత్తమై సడెన్ బ్రేక్‌ వేసి ట్రైన్‌ను ఆపేశాడు. వెంటనే రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఇంజనీరింగ్ విభాగం, స్థానిక పోలీసుల బృందాలు ట్రాక్‌పై ఉన్న వాహనాన్ని ట్రాక్ నుండి తొలగించాయి. అయితే ట్రైన్ సడెన్ బ్రేక్ వేసినప్పటికీ రైలు ముందు భాగం ఆటోను ఢీకొట్టినట్టు తెలుస్తోంది.

అయితే ఘటనా స్థలంలో ట్రాక్ భద్రతా తనిఖీల పూర్తైన తర్వాత రాత్రి 11:15 గంటలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించి 11:50 గంటలకు తిరువనంతపురం సెంట్రల్‌కు చేరుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. లోకో పైలట్ సరైన సమయంలో స్పందించి బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు ప్రశంసించారు. ఇక ట్రాక్‌పై ఆటోను వదిలేసి డ్రైవర్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
టెన్త్ స్టూడెంట్స్‌కు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు..
టెన్త్ స్టూడెంట్స్‌కు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు..
ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. కాసేపటికే
ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. కాసేపటికే
రికార్డు సెంచరీతో గంభీర్, అగార్కర్‌లకు ఇచ్చిపడేసిన రోహిత్..
రికార్డు సెంచరీతో గంభీర్, అగార్కర్‌లకు ఇచ్చిపడేసిన రోహిత్..