AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

దేశ విమానయాన రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతితో శంఖ్ ఎయిర్, అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్‌ప్రెస్ అనే మూడు కొత్త విమాన సంస్థలు త్వరలో సేవలు ప్రారంభించనున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇది మార్కెట్లో పోటీని పెంచి, ప్రయాణికులకు తక్కువ ధరకే విమాన టికెట్లను అందిస్తుంది

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..
3 New Airlines To Launch In India
Krishna S
|

Updated on: Dec 24, 2025 | 4:56 PM

Share

భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. విమాన సంస్థల మధ్య పోటీని పెంచి, ప్రయాణికులకు తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలో మరో మూడు కొత్త విమాన సంస్థలు అందుబాటులోకి రానున్నాయి. శంఖ్ ఎయిర్, , అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్‌ప్రెస్ అనే మూడు కొత్త విమానయాన సంస్థలు త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని కేంద్రమంత్రి రామ్ మోహన్ నాయుడు ప్రకటించారు.

మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు గత వారం రోజులుగా ఈ కొత్త ఎయిర్‌లైన్స్ బృందాలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఈ మూడు సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లభించింది. ఏ విమాన సంస్థకైనా ఇది తొలి, అత్యంత కీలకమైన విజయం. ఈ అనుమతితో ఈ కంపెనీలు తమ విమానాలను భారత గగనతలంపై ఎగరవేయడానికి అధికారిక సన్నాహాలు మొదలుపెట్టవచ్చు.

కొత్త ఎయిర్‌లైన్స్ ప్రత్యేకతలు ఇవే

శంఖ్ ఎయిర్

ఇది ఉత్తరప్రదేశ్ తొలి షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్. దీని ప్రధాన కేంద్రాలు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, లక్నో. వారణాసి, గోరఖ్‌పూర్ వంటి నగరాల నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు తమ సేవలను అందించనుంది. ఇది కొత్త తరం బోయింగ్ 737-800 విమానాలను ఉపయోగించనున్నాయి. ఇది పర్యాటకం, వ్యాపార రంగానికి పెద్ద పీట వేయనుంది.

అల్ హింద్ ఎయిర్

ఈ ఎయిర్ లైన్ దక్షిణ భారతంపై ఫోకస్ చేయనుంది. కోజికోడ్‌కు చెందిన అల్ హింద్ గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ కేరళలోని ఇంటీరియర్ ప్రాంతాలను బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు తన సేవలను అందించనుంది.

ఫ్లైఎక్స్‌ప్రెస్

మధ్య భారత్, ఇతర ప్రాంతీయ మార్గాల్లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ సంస్థ సిద్ధమవుతోంది.

రీజినల్ కనెక్టివిటీకి ఉడాన్ ఊతం

భారత్ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటిగా నిలిచిందని మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో UDAN పథకం ద్వారా చిన్న నగరాలను సైతం ఎయిర్ నెట్‌వర్క్‌లోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఇప్పటికే స్టార్ ఎయిర్, ఇండియావన్ ఎయిర్, ఫ్లై 91 వంటి సంస్థలు ప్రాంతీయంగా సేవలు అందిస్తుండగా ఈ కొత్త సంస్థల రాకతో కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది.

ప్రయాణికులకు ప్రయోజనాలు

మార్కెట్లో పోటీ పెరగడం వల్ల విమాన టికెట్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రయాణికులు తమకు నచ్చిన సమయంలో నచ్చిన సంస్థను ఎంచుకోవచ్చు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఎయిర్‌లైన్స్ మరిన్ని సౌకర్యాలను అందించే అవకాశం ఉంది. దేశ ఆర్థిక పురోగతిలో విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తుందని, మరిన్ని సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి రామ్ మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ