AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: దేశంలోని అన్ని ప్రాంతాలను కలిపే ఏకైక రైల్వే స్టేషన్.. ఇక్కడ ఎన్ని ట్రైన్స్ ఆగుతాయో తెలుసా?

సాధారణంగా తక్కువ ఖర్చుతో దూర ప్రయాణాలు చేసే వారికి రైల్వే ప్రయాణం చాలా ఉత్తమం. అయితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మనం ట్రావెల్ చేయాలంటే కొన్ని సార్లు ఒకే ట్రైన్‌లో వెళ్లడం సాధ్యం కాదు.. మనం కచ్చితంగా ఒకటి లేదా రెండు ట్రైన్స్‌ను ఎక్కాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే స్టేషన్‌ నుంచి దేశంలోని ఎక్కడికైనా ఒకే ట్రైన్‌లో మీరు ప్రయాణించవచ్చు. అవును ఈ స్టేషన్‌ నుంచి దేశ నలుమూలలకు ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయి. ఆ స్టేషన్ ఏదో మీకు తెలుసా?

Indian Railways: దేశంలోని అన్ని ప్రాంతాలను కలిపే ఏకైక రైల్వే స్టేషన్.. ఇక్కడ ఎన్ని ట్రైన్స్ ఆగుతాయో తెలుసా?
Anand T
|

Updated on: Dec 23, 2025 | 1:29 PM

Share

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో భారత్‌ కూడా ఒకటి. మన దేశంలో రోజుకూ సుమారుగా 13 వేలకు పైగా ట్రైన్స్‌ పట్టాలపై పరుగులు పెడతాయి. ఈ రైళ్లు దాదాపుగా దేశ వ్యాప్తంగా 7,000 స్టేషన్లను కలుపుతూ రాకపోకలు సాగిస్తాయి. అయితే కొన్ని స్టేషన్‌ల నుంచి మనం సెలెక్టెడ్ ప్రాంతాలకు మాత్రమే వెళ్లగలం.. ఆ స్టేషన్ నుంచి దేశం మొత్తం తిరగలేం. కానీ ఇక్కడో స్టేషన్ నుంచి మాత్రం దేశంలోని అన్ని ప్రాంతాలకు మనం ప్రయాణం చేయవచ్చు. అవును మథుర రైల్వే స్టేషన్‌లో 24 గంటల పాటు దేశంలోని ప్రతి ప్రాంతానికి రాకపోకలు సాగించే ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్‌ ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ నుంచి రోజూ 197 రైళ్లు రాకపోకాలు సాగిస్తాయి.

భారతదేశ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమం వైపు ప్రయాణించే ప్రతి రైలు మధుర జంక్షన్‌లో ఆగుతుంది. ఇది సుదూర ప్రయాణానికి ముఖ్యమైన కేంద్రంగా మారుతుంది. ఇక్కడి నుండి, ప్రయాణీకులు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, అనేక ఇతర ప్రాంతాలతో సహా ప్రధాన నగరాలు,రాష్ట్రాలకు ప్రయాణించవచ్చు. అలాగే ఈ స్టేషన్ శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన మధురలో ఉండడంతో దీనికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మధుర నుండి 11 కి.మీ దూరంలో ఉన్న బృందావనంలోనే శ్రీకృష్ణుడి బాల్యం మొత్తం గడిచిందని పురణాలు చెబుతాయి. అందుకే ఈ ప్రాంతాన్ని చూసేందుకు దేశ నలుమూల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడివి వస్తారు.

ఈ స్టేషన్‌ను ఎప్పుడు నిర్మించారు.

మథురాలో రైల్వే కనెక్టివిటీని 1875లో ప్రారంభించారు. తొలి సారిగా హత్రాస్ రోడ్ నుండి మథురా క్యాంటోన్మెంట్ వరకు ఈ రైల్వే లైన్‌ను అప్పటి బాంబే, బరోడా సెంట్రల్ ఇండియా ఆద్వర్యంలో నిర్మించారు. ఆ తర్వాత 1881లో అచ్నేరా-మథురా లైన్, 1889లో మథురా-వృందావన్ రైల్వే లైన్స్‌ను స్టార్ట్ చేశారు. ఇలా కాలక్రమేనా రైల్వే లైన్స్‌లు పెరిగి ఈ స్టేషన్ దేశ నలుదిక్కుల ప్రాంతాలకు రైల్వే సేవలను అందించడం ప్రారంభించింది. ఈ స్టేషన్‌లో దాదాపు 10 నుంచి 14 ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. వెంటనే అప్లై చేయండ
తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. వెంటనే అప్లై చేయండ
కుటుంబంలో ఒకటిగా ఉన్న గోమాత.. తెల్లారేసరికల్లా విగతజీవిగా..!
కుటుంబంలో ఒకటిగా ఉన్న గోమాత.. తెల్లారేసరికల్లా విగతజీవిగా..!
ఇళ్లకు PNGని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత?
ఇళ్లకు PNGని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత?
తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
రూ. 11.75 కోట్ల జీతం.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కొట్టలే
రూ. 11.75 కోట్ల జీతం.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కొట్టలే
గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులకు కేంద్రం గుడ్‌న్యూస్!
గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులకు కేంద్రం గుడ్‌న్యూస్!
ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!
ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!
హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!
హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!
ఓటీటీలో టాప్ ట్రెండింగ్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించిన నాగ్
ఓటీటీలో టాప్ ట్రెండింగ్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించిన నాగ్
భారత్–వియత్నాం మంత్రుల భేటీ: గిరిజన అభివృద్ధికి కొత్త దిశ
భారత్–వియత్నాం మంత్రుల భేటీ: గిరిజన అభివృద్ధికి కొత్త దిశ