AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అంతడబ్బు అక్కడెలా దాచావ్‌‌ రా.. పోలీసులే నోరెళ్లబెట్టిన సీన్.. చూస్తే మతిపోవాల్సిందే

అదో హైవే.. పోలీసులు సాధారణ తనిఖీలు జరుపుతున్నారు.. అప్పుడే అటుగా ఓ వ్యక్తి బైక్‌పై వస్తున్నాడు. రోడ్డుపై ఉన్న పోలీసులను చూసి సడన్‌ బ్రేక్ వేశాడు. వెంటనే బైక్‌ను యూటర్న్‌ చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు.. అది గమనించిన పోలీసులు అతన్ని వెంబడించి అదుపులోకి తీసుకొని.. చెక్‌ చేశారు. ఇంకేముందు బైక్‌ సీట్‌ కింద కనిపించిన నోట్ల కట్టలను చూసి అవాకయ్యారు. వెంటనే ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

Viral Video: అంతడబ్బు అక్కడెలా దాచావ్‌‌ రా.. పోలీసులే నోరెళ్లబెట్టిన సీన్.. చూస్తే మతిపోవాల్సిందే
Havala Money Seized In Coimbatore
Anand T
|

Updated on: Dec 24, 2025 | 9:10 AM

Share

బైక్‌ సీటు కింద డబ్బుదాడి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. అతని నుంచి రూ.56.50లక్షలు స్వాధీనం చేసుకున్న ఘటన తమిళనాడు-కేరళ సరిహద్దులోని వేలంతవలం వద్ద మంగళవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు-కేరళ సరిహద్దులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అటుగా బైక్‌ వెళ్తున్న ఓ వ్యక్తి పోలీసులను చూసి సడెన్ బ్రేక్ వేశాడు. వెంటనే బైక్‌ను యూటర్న్‌ చేసుకొని రాంగ్‌రూట్‌లో పారిపోచేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన పోలీసులు అనుమానం వచ్చి అతన్ని వెంబడించి పట్టుకున్నారు.ఎందుకు పారిపోతున్నావని.. అతన్ని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానలు చెప్పాడు.

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. అతనితో పాటు బైక్‌ను తనిఖీ చేశారు. అయితే పోలీసులకు మొదట ఎలాంటి అనుమానస్పద వస్తువులు కనిపించలేదు.. కానీ సీటుపై తట్టగానే.. ఏదో తేడా శబ్ధం రావడంతో.. బైక్ సీట్‌ను ఓపెన్ చేసి చూశారు. ఇంకేముందు సీట్‌కింద లక్షల కొద్ది నోట్ల కట్టలు దర్శనిమచ్చాయి. ఈ డబ్బు ఎక్కడిదని అతన్ని ప్రశ్నించగా.. తాను బంగారు వ్యాపారినని.. కోయంబత్తూరులో ఆభరణాల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును తీసుకెళ్తున్నట్టు తెలిపారు. కానీ అందుకు సంబంధించిన సరైన పత్రాలను అతను చూపించలేకపోయాడు.

దీంతో సరైన పత్రాలు లేకి కారణంగా.. అతని బైక్‌లో తరలిస్తున్న రూ.56.50 లక్షల మొత్తం నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనతరం ఆ డబ్బును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. ఇక ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.