Ration Subsidy:రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై కేవలం రూ.20కే అది కూడా పంపిణీ.. తప్పక తీసుకోండి
న్యూయర్, సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ దుకాణాల్లో ప్రజలకు అందించే ఇతర నిత్యావసరాల సరుకులతో పాటు గోధుమ పిండిని కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ.20కే కేజీ గోధుమ పిండిని రేషన్ షాపుల్లో ప్రజలకు అందించనుంది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో పేద ప్రజలకు పండుగ సమయంలో తక్కువ ఖర్చుతో పిండి వంటలు చేసుకునే అవకాశం లభిస్తుంది.

న్యూయర్, సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ షాపుల్లో రేషన్ దుకాణాల్లో ప్రజలకు అందించే ఇతర నిత్యావసరాల సరుకులతో పాటు గోధుమ పిండిని కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ.20కే కేజీ గోధుమ పిండిని రేషన్ షాపుల్లో ప్రజలకు అందించనుంది. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో వరి ఎక్కువగా పండిస్తారు. అలాగే ఉత్తరాదిలో కూడా రైతులు ఎక్కువగా గోధుమలను పండిస్తారు. మన దగ్గర బియ్యం ఉత్పత్తి ఎలా అయితే ఎక్కువగా ఉంటుందో.. అక్కడ గోధుమల ఉత్పత్తి కూడా ఎక్కువ.. అందుకే దేశవ్యాప్తంగా గోధుమ పిండి వాడకాన్ని కేంద్ర ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరలో రేషన్‌లో గోధుమ పిండిని అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కేజీ గోధుమపిండి రూ.40 నుంచి 80 దాకా ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా రేషన్ దుకాణాల్లో కేవలం రూ.20కే గోధుమ పిండిని అందించనుంది. ఈ నిర్ణయాన్ని జనవరి ఒకటి నుంచి రేషన్ షాపుల్లో అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం
మొదటగా రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ తర్వాత పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని అమలు చేయనుంది. అయితే జనవరిలో అందించే ఈ సరుకులను ప్రభుత్వం ఈ నెల 26 నుంచే పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలోని రేషన్ షాపులకు సరుకులు చేరగా.. డిమాండ్‌ను బట్టి మరిన్ని సరుకులను పంపిణీ చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
