AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ లో న్యూ ట్రెండ్.. ఇద్దరమ్మాయిలతో అలా సాగిపోతున్నారు

టాలీవుడ్ లో న్యూ ట్రెండ్.. ఇద్దరమ్మాయిలతో అలా సాగిపోతున్నారు

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Dec 24, 2025 | 1:10 PM

Share

సంక్రాంతి పండుగకు తెలుగు సినిమాలు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఒక హీరో, రెండు హీరోయిన్ల మధ్య నడిచే సరదా కామెడీ కథలు ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వెంకటేష్ సినిమాతో ఈ ఫార్ములా బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఈ సంక్రాంతికి శర్వానంద్ 'నారి నారి నడుమ మురారి', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఇదే స్టైల్‌లో వచ్చి విజయాలు సాధించాలని చూస్తున్నాయి.

సంక్రాంతి అంటేనే సరదా పండగ..! ఆ సరదాను ఇంకాస్త పెంచడానికి ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయే హీరోల కథలను రాసుకుంటున్నారు దర్శకులు. మొన్నామధ్య ఎక్స్ గాళ్‌ఫ్రెండ్, ఎక్స్‌లెంట్ వైఫ్ అంటూ వచ్చి 300 కోట్లు కొట్టారు వెంకీ. ఈ ఏడాది అదే ఫార్ములాను మరో ఇద్దరు హీరోలు ఫాలో అవుతున్నారు. వాళ్లు కూడా ఇద్దరు నారిల మధ్య నలిగే మురారులే.. ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయే హీరో కథ అంటే ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. అదే ఫార్ములాతో వచ్చి బ్లాక్‌బస్టర్ కొట్టారు వెంకటేష్, అనిల్. వాళ్లు ఎక్స్ గాళ్‌ఫ్రెండ్, ఎక్స్‌లెంట్ వైఫ్ అంటూ వస్తే.. ఈసారి రవితేజ, శర్వా కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. తాజాగా విడుదలైన నారినారి నడుమ మురారి టీజర్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. చూస్తున్నారుగా.. ఒకే ఆఫీస్.. మాజీ లవర్.. ప్రజెంట్ లవర్.. మధ్యలో నలిగిపోయే హీరో.. ఇదే నారినారి నడుమ మురారి కథ. దీన్నే ఫన్నీగా తెరకెక్కిస్తున్నారు రామ్ అబ్బరాజు. సామజవరగమనా తర్వాత రామ్ చేస్తున్న సినిమా ఇది. శర్వానంద్‌కు జోడీగా సాక్షి వైద్య, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. జనవరి 14 సాయంత్రం 5.49 గంటల షోతో విడుదల కానుంది ఈ చిత్రం. సంక్రాంతికే వస్తున్న మరో సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలోనూ హీరో పాత్ర ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయేదే. భార్య, ప్రియురాలి మధ్య జరిగే ఫన్నీ స్టోరీనే భర్త మహాశయులకు విజ్ఞప్తి కథ. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌తో ఈ తరహా ఇద్దరమ్మాయిల కథకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

రైలు ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఛార్జీలు

మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు

Egg Price: మండిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్ ఎంతంటే

ఊబకాయాన్ని తగ్గించే బ్యాక్టీరియా.. పరిశోధకుల కీలక ముందడుగు