చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
అనంతపురం జిల్లాలో మాధుర్య అనే విద్యార్థిని చర్మవ్యాధి, ఊబకాయం చికిత్స కోసం వాడిన మందుల దుష్ప్రభావాల వల్ల మరణించింది. అధిక మోతాదు గుండె నొప్పి, ఫిట్స్‌కు దారితీసినట్లు వైద్యులు భావిస్తున్నారు. కాస్మొటిక్స్, మందులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరని ఈ ఘటన హెచ్చరిస్తోంది. మందుల వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
చర్మ సంరక్షణకోసం చాలామంది రకరకాల కాస్మొటిక్స్, మందులు వాడుతుంటారు. అవి ఒక్కోసారి అవి వికటించి అనర్ధాలకు దారితీస్తాయి. తాజాగా ఓ యువతి చర్మవ్యాధికోసం వాడిన మెడిసిన్ ఆమెను బలి తీసుకుంది. దీంతో తల్లిదండ్రులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం జిల్లా నందికొట్కూరుకు చెందిన మాధుర్య హాస్టల్‌లో ఉంటూ ఎస్కే యూనివర్శిటీలో ఎమ్మెస్సీ సెకండ్ ఇయర్ చదువుతోంది. కొంతకాలంగా మాధుర్య స్కిన్ ట్రీట్‌మెంట్‌తోపాటు, ఒబెసిటీ కారణంగా బరువు తగ్గేందుకు మందులు వాడుతోంది. ఇటీవల ఆమెకు ఫిట్స్ రావడంతో యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మాధుర్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చర్మవ్యాధికి, ఒబెసిటీకి వాడుతున్న మందుల డోస్ ఎక్కువ అవ్వడం వల్ల గుండె నొప్పితో పాటు… ఫిట్స్ కూడా రావడంతో మాధుర్య చనిపోయినట్లు వైద్యులు భావిస్తున్నారు. విద్యార్థిని మాధుర్య ఆకస్మిక మృతితో తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె చర్మవ్యాధికి.. ఒబేసిటీకి ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటుంది…? ఏం మందులు వాడుతుంది…? మందుల కాంబినేషన్ ఏమైనా వికటించిందా..? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మాధుర్య మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
Egg Price: మండిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్ ఎంతంటే
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే
ప్రకృతి థీమ్తో ఎయిర్పోర్ట్ టెర్మినల్
కొడుకు హత్యకు తండ్రి సుపారీ... ఎందుకో తెలిసి పోలీసులే షాక్

