రైలు ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు
భారతీయ రైల్వే డిసెంబరు 26 నుండి రైలు ఛార్జీలను పెంచింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలను బ్యాలెన్స్ చేయడమే దీనికి కారణం. లోకల్, స్వల్ప దూర ప్రయాణాలకు ఛార్జీలలో మార్పు లేదు. 215 కి.మీల పైన ఆర్డినరీ క్లాస్‌కు కి.మీకి 1 పైసా, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కి.మీకి 2 పైసలు పెంపు వర్తిస్తుంది. ఈ పెంపు ద్వారా రైల్వేకు అదనంగా రూ.600 కోట్లు ఆదాయం అంచనా.
రైలు ప్రయాణికులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఈ నెలనుంచి రైలు ఛార్జీలు పెంచుతున్నట్టు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. పెంచిన ధరలు డిసెంబరు 26 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూనే.. ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పెరిగిన ధరలు ఏమేరకు పెరిగాయంటే.. లోకల్, స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆర్డినరీ క్లాస్‌లో 215 కి.మీల కంటే తక్కువ దూరం ప్రయాణికులకు ఎలాంటి ఛార్జీలు పెంచలేదు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే.. ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటరకు 1 పైసా చొప్పన పెంచింది. మెయిల్/ఎక్స్‌ప్రెస్ ఏసీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటరకు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్-ఏసీ ట్రైన్‌లో 500 కి.మీ దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో రైల్వేకు దాదాపు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల భారం కలిపి నిర్వహణ ఖర్చులు రూ.2.63 లక్షల కోట్లకు చేరడం వల్లే చార్జీలు పెంచాల్సి వచ్చిందని రైల్వేశాఖ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
Egg Price: మండిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్ ఎంతంటే
ఊబకాయాన్ని తగ్గించే బ్యాక్టీరియా.. పరిశోధకుల కీలక ముందడుగు
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే
ప్రకృతి థీమ్తో ఎయిర్పోర్ట్ టెర్మినల్
కొడుకు హత్యకు తండ్రి సుపారీ... ఎందుకో తెలిసి పోలీసులే షాక్
ఒక్క గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులా ?? ఇదెక్కడి ట్విస్ట్

