AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊబకాయాన్ని తగ్గించే బ్యాక్టీరియా.. పరిశోధకుల కీలక ముందడుగు

Phani CH
|

Updated on: Dec 24, 2025 | 11:54 AM

Share

ప్రస్తుత కాలంలో ఊబకాయం చాలామందిని వేధిస్తున్న సమస్య. అమెరికా పరిశోధకులు 'ట్యూరిసిబాక్టర్' అనే పేగు బాక్టీరియాను కనుగొన్నారు, ఇది బరువు తగ్గించడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ బాక్టీరియా శరీరంలోని కొవ్వు, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మనుషులపై పరిశోధనలు ఇంకా జరగనప్పటికీ, భవిష్యత్తులో ఊబకాయానికి సహజసిద్ధమైన చికిత్సగా ఇది మారగలదని ఆశిస్తున్నారు.

ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. దీనిని తగ్గించుకోడానికి అనేక మంది అనేక మార్గాలు అనుసరిస్తుంటారు. ఎక్సర్‌సైజ్‌ చేస్తారు, రకరకాల డైట్‌ లు ఫాలో అవుతారు. ఈ క్రమంలో అమెరికా పరిశోధకులు ఈ ఊబకాయం, అధిక బరువు సమస్యలకు చెక్‌ పెట్టేందుకు కీలక ముందడుగు వేశారు. బరువు తగ్గించడంతో పాటు జీవక్రియను మెరుగుపరిచే ఒక ప్రత్యేకమైన బాక్టీరియాను పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో బరువు తగ్గించే ఇంజెక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజసిద్ధంగా ఈ సమస్యను అధిగమించేందుకు ఈ పరిశోధన మార్గం సుగమం చేయగలదని భావిస్తున్నారు. అమెరికాలోని ఉటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన అధ్యయనంలో ‘ట్యూరిసిబాక్టర్’ (Turicibacter) అనే పేగు బాక్టీరియా బరువు పెరుగుదలను నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. అధిక కొవ్వు పదార్థాలున్న ఆహారం తీసుకున్న ఎలుకలలో కూడా ఈ బాక్టీరియా రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను తగ్గించిందని ‘సెల్ మెటబాలిజం’ జర్నల్‌లో ప్రచురించిన తమ నివేదికలో తెలిపారు. ఊబకాయంతో బాధపడే వారిలో ఈ బాక్టీరియా స్థాయిలు తక్కువగా ఉండటాన్ని గమనించామని, ఇది మనుషుల్లోనూ ఆరోగ్యకరమైన బరువును ప్రోత్సహించగలదని వారు అంచనా వేస్తున్నారు. శరీరంలో ‘సెరామైడ్లు’ అనే కొవ్వు అణువుల ఉత్పత్తిని ప్రభావితం చేయడం ద్వారా ట్యూరిసిబాక్టర్ పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. అధిక సెరామైడ్లు టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులతో ముడిపడి ఉంటాయి. ఈ బాక్టీరియా వాటి స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అయితే, ఈ ఫలితాలు కేవలం ఎలుకలపై జరిపిన ప్రయోగాల ఆధారంగా వెల్లడైనవని, ఇవి మనుషులకు వర్తిస్తాయో లేదో ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు స్పష్టం చేశారు. “ఎలుకలలో బరువు పెరుగుదలను మెరుగుపరిచాం. కానీ ఇది మనుషుల్లో ఎంతవరకు నిజమో మాకు తెలియదు” అని పరిశోధక బృందంలోని ఒకరు తెలిపారు. అయినప్పటికీ, భవిష్యత్తులో సూక్ష్మజీవులనే మందులుగా మార్చి ఊబకాయం వంటి సమస్యలకు చికిత్సలు అభివృద్ధి చేసేందుకు ఈ పరిశోధన కీలకంగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు

వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే

తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

మీ గుడి మీద మైక్‌ లేదా ?? ఈ టీటీడీ ఆఫర్ మీకే

ఏవియేషన్‌ చరిత్రలో అద్భుతం.. ప్రకృతి థీమ్‌తో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్