డబ్బు, మనీ కాదండోయ్.. నిజమైన సంతోషం ఎక్కడుంటుందో తెలుసా?
Samatha
24 December 2025
చాలా మంది చాలా సంతోషంగా, ఆనందంగా ఉండాలి అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే సంతోషంగా ఉంటారు.
అయితే చాలా మందిలో డౌట్ ఉంటుంది?నిజమైన సంతోషం ఎక్కడుంటుంది?డబ్బు, విజయం, కీర్తి ఎందులో ఉంటుదనిఆలోచిస్తుంటారు.
కాగా, నిజమైన సంతోషం ఎక్కడ దాగుంటుంది అనేదానిపై స్టడీ చేయగా, అందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్ మెంట్ 85 సంవత్సరాలుగా మానవ ఆనందంపై సర్వే చేసింది.
ఈ స్డడీలో అనేక విషయాలు వెల్లడిచారు. చాలా మంది సంతోషం అనేది మనీ, కీర్తి అని చెప్పారు, కానీ సంవత్సరాలు గడిచేకొద్దీ, ప్రజలు తమ జీవితంలోని నిజమైన సంతోషం గురించి తెలియజేశారంట.
చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఎక్కువ రోజులు జీవించిన వ్యక్తుల్లో ధనవంతులు లేరని, నిజమైన సంతోషం అనేది డబ్బు, కీర్తి కాకుండా వ్యక్తిగత సంబంధాల్లో ఉందని వారు తెలిపారు.
చాలా మంది నిజమైన సంతోషం అనేది డబ్బు లేదా కీర్తితో ముడిపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ నిజమైన సంతోషం అనేది భాగస్వామి, కుటుంబం, స్నేహితులతో ఉండే సంబంధాలపై ఆధారపడి ఉంటుందంట.
మనం వారితో ఎంత ఆనందంగా ఉన్నాం అనేది, మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంట. అందుకే ఏ వ్యక్తి అయితే మంచి సంబంధాలు కలిగి ఉంటాడో, అతనే చాలా సంతోషంగా ఉన్నట్లు అంటున్నారు పరిశోధకులు.
1300 మందితో పరిశోధకులు, వివాహాలు, అనారోగ్యాలు, కెరీర్, పిల్లల పెంపకం, వృధ్యాప్యం వీటన్నింటిని అనుసరించి సర్వే చేయగా ఇతరులతో మంచి స్నేహపూర్వక సంబంధం ఉన్నవారే అత్యంత సంతోషమైన వ్యక్తులు అని వెళ్లడైనదంట.