మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే అదృష్టానికి కొదవే ఉండదంట!

Samatha

23 December 2025

ఇంటి లోపల మొక్కలు  పెంచుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ఇంటిలో మొక్కలను పెంచుకుంటారు.

అయితే కొన్ని మొక్కలు ఇంటికి అందాన్ని తీసుకొస్తే, మరికొన్ని మొక్కలు ఇంటి అదృష్టం తీసుకొస్తాయి, కాగా, ఆ మొక్కలు ఏవో ఇప్పుడు చూద్దాం.

క్రాసులా మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఇంటిలో ఉండట వలన కుబేరుడి అనుగ్రహం కలిగి అదృష్టం కలిసి వస్తుందంట.

మనీ ప్లాంట్ మొక్క ఇంటిలో ఉండటం చాలా శుభప్రదం. ఇది పెరుగుతూ ఉంటే, ఇంటిలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతూ ఉంటుందంట.

జమ్మి చెట్టును ఇంటిలో పెంచుకోవడం కూడా చాలా శుభప్రదం. ఇది శని దేవుడికి సంబంధించినది, కాబట్టి ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.

అపరాజిత మొక్క లక్ష్మీదేవికి సంబంధించినది అంటారు. అందువలన ఈ మొక్కను ఇంటిలో పెంచుకోవడం వలన ఆ ఇంటి వారికి ధనానికి లోటు ఉండదంట.

ఇంటిలో తులసి చెట్టు ఉండటం కామన్. అయితే ఈ తులసి మొక్కను ఇంటిలో పెంచుకోవడం వలన పాజిటివిటీ పెరుగుతుందంట.

స్నేక్ ప్లాంట్ మొక్క ఇంటిలో పెంచుకోవడం చాలా మంచిది. ఇది ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా, అదృష్టం కూడా తీసుకొస్తుందంట.