పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు ఇవే.. విస్మరిస్తే బతకడం కష్టమే!

Samatha

22 December 2025

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ, అనేక సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు.

ముఖ్యంగా ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుంది. రోజు రోజుకు క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి.

ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కాగా, అసలు పెద్ద పేగు క్యాన్సర్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి లక్షణాలు విస్మరించకూడదు అనేది చూద్దాం.

ప్రతి రోజూ ఉదయం మలంలో రక్తం కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అదే విధంగా నిరంతరం కడుపు నొప్పి కూడా పెద్ద పేగు క్యాన్సర్ లక్షణమే, కడుపు ఉబ్బరం, బరువుగా అనిపించడం వంటి లక్షణాలు విస్మరించకూడదు.

మలవిసర్జనలో ఇబ్బంది ఎదుర్కోవడం, మలబద్ధకం వంటి సమస్య ఎక్కువగా ఉన్నా కూడా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

అలాగే ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం పెద్ద పేగు క్యాన్సర్‌లో ప్రధాన లక్షణం. మీలో ఈ లక్షణం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలంట.

నిరంతరం అలసిపోయినట్లు అనిపించడం, నీరసం, అలసట, ఏ పని చేయలేకపోవడం వంటి లక్షణాలు కూడా పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలే.