15 December 2025

పుదీనా చేసే మేలే వేరు.. దీన్ని తినడం వలన చెప్పలేనన్ని లాభాలు!

samatha

Pic credit - Instagram

పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో అనేకఔషధ గుణాలు ఉంటాయి. అందువలన దీనిని తినడం వలన అనేక ప్రయజనాలు ఉన్నాయంటారు ఆరోగ్య నిపుణులు.

పుదీనాలో యాంటీఇన్‌ఫ్లమేటరీ  గుణాలు ఎక్కువగా ఉంటాయి, ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది వికారం, వాంతులు, కడుపు నొప్పిని తగ్గిస్తుంది.

పుదీనాలోని మెంథాల్ శ్వాసనాళాలను తెరుస్తుంది, శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ఇది దగ్గు జలుబుకు మంచి ఉపశమనం కలిగిస్తుంది.

 పుదీనా నూనెను తలకు పట్టించడం వలన తలనొప్పి, మైగ్రేన్‌ లక్షణాలు తగ్గుతాయి. అంతే కాకుండా తలనొప్పి నుంచి మంచి ఉపశమనం అందిస్తుంది

పుదీనా యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి, మొటిమలు, చర్మం ఎర్రబారడం, పగిలిన చర్మ సంస్యలను తగ్గిస్తుంది. పుదీనా నూనెను చర్మంపై పూతగా ఉపయోగించవచ్చు.

పుదీనా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాను నియంత్రించి, శ్వాసను ఫ్రెష్‌గా ఉంచుతుంది. ఇది పళ్ళు తోముకోవడానికి , మౌత్ వాష్‌గా కూడా ఉపయోగపడుతుంది.

 పుదీనా  సువాసన మానసిక స్థితిని మెరుగుపరచి, ఒత్తిడి, ఆయాసాన్ని తగ్గిస్తుంది. పుదీనా టీ లేదా నూనెను తీసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు.

 పుదీనాలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.