08 December 2025

కాల సర్ప దోషం ఉంటే  కలలో పాములు కనిపిస్తాయా?

samatha

Pic credit - Instagram

జాతకంలో కొందరికి కొన్ని దోషాలు ఉంటాయి. ఇవి వారి జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతాయి. ఎన్నో విధాల నష్టాలను తీసుకొస్తాయి.

చాలా మంది తమ జాతకంలోని కాల సర్ప దోషం, కుజ దోషాల సమస్యలతో సతమతం అవుతుంటారు. అయితే కాల సర్ప దోషం ఉంటే కొన్ని రకాల కలలు వెంటాడుతుంటాయి.

కాగా, ఇప్పుడు మనం కాల సర్ప దోషం ఉంటే ఎలాంటి కలలు వస్తాయి? దీని గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.

కాల సర్ప దోషం చాలా ప్రభావమంతమైనది. ఈ దోషం ఉంటే ఎక్కువగా పాములు కలలో కనిపిస్తుంటాయి. మీకు పదే పదే పాములు కనిపిస్తే కాల సర్ప దోషం ఉన్నట్లేనంట.

అలాగే నిద్రపోతున్నప్పుడు కలలో పాములు పైకి ఎక్కినట్లు, పాము కాటుకు గురైనట్లు, పాములు కాలికి చుట్టుకున్నట్లు ఇవన్నీ కూడా కాల సర్ప దోషానికి కారణమే అంటున్నారు పండితులు.

అదే ఒక వ్యక్తి కలలో పాము ఎగురుతున్నట్లు లేదా గాలిలో తేలియాడుతున్నట్లు కనిపించినా ఇది కాల సర్ప దోషానికి సంకేతమేనంట.

అదే విధంగా, ఏ వ్యక్తి అయితే పాములు కుప్పలు తెప్పలుగా, ఎక్కువ మొత్తంలో, చాలా సార్లు, పదే పదే కనిపిస్తాయో వారికి కాల సర్పదోషం ఉన్నట్లేనంట

ఇక ఈ దోషం ఉన్న వ్యక్తి ఏ పనిలోనూ విజయం సాధించలేడు, అంతే కాకుండా, మానసిక ఒత్తిడి క్రమంగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు వెంటాడతాయి.