పాము తోకతో సమస్యల్లో పడే వారు వీరే.. జాగ్రత్త పడకపోతే నష్టమే
Samatha
22 December 2025
ఒక వ్యక్తి నిరంతరం సమస్యలు ఎదుర్కోవడం, ఆర్థికంగా బలహీనపడటం, ఏ పని చేసినా కలిసి రాకపోవడానికి ముఖ్య కారణం కాలసర్ప దోషం అంటున్నారు పండితులు
కాలసర్ప దోషం చాలా ప్రమాదకరమైనది. దీని వలన ఒక పాము కాటు వేయడం వలన ఎంత నష్టం అయితే సంభవిస్తుందో, అంతకు రెట్టింపు నష్టం కాలసర్పదోషం వలన కలుగుతుంది.
రాహు, కేతువు అనే రెండు కీడు గ్రహాల వలన కాలసర్పదోషం అనేది ఏర్పడుతుంది. రాహువు అనేది ఒక భయానక కాలకూట పాము తల లాంటిది.
అలాగే కేతువు అనేది ఆ పాముకు తోకలాంటిది. ఈ పాము తోక వలన చాలా సమస్యలు ఎదురు అవుతాయి. ఈ రెండు గ్రహాల మధ్య ఏడు గ్రహాలు ఉంటాయి. దీని వలన ఏ యోగాలు పని చేయవు.
ఆర్థికంగా, ఆరోగ్యం పరంగా అనేక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చాలా మంది కాలసర్పదోషం ఉంటే భయపడి పోతుంటారు.
కాల సర్ప దోషం ఉన్నవారు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. వివాహం జరిగినా అది అనేక సమస్యలను తీసుకొస్తుంది. ఇంటిలో డబ్బు నిలవదు.
అంతే కాకుండా వ్యాపారంలో నష్టాలు, ప్రయాణాల్లో ఊహించని ఆటంకాలు, అవరోధాలు ఎదురు అవుతుంటాయి.
అందుకే కాలసర్ప దోషం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని, వీటి నివారణకు పూజలు చేసుకోవడం ఉత్తమం అంటుంటారు పండితులు.