న్యూ ఇయర్‌లో బీచ్ ట్రిప్.. ఇక్కడికి వెళితే ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదంట!

Samatha

22 December 2025

న్యూ ఇయర్ వచ్చేస్తుంది. ఈ సమయంలో సెలబ్రేషన్స్ కోసం ఎక్కడి వెళ్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటారు. వారి కోసమే ఈ అద్భుతమైన ప్రదేశాలు.

బీచ్‌లలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అదిరిపోతుందంట. కాగా, ఇప్పుడు మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయడానికి బెస్ట్ బీచ్‌లు ఏవో చూసేద్దాం.

పార్టీలకు అదిరిపోయే బీచ్ అంటే గోవా బీచ్. గోవాలో అదిరిపోయే లైటింగ్ నైట్ పార్టీలకు చాలా బాగుంటుందంట. ఇది బెస్ట్ ప్లేస్.

నూతన సంవత్సరం మీకు చిరస్మరణీయమైన జ్ఞాపకాలను ఇవ్వాలి అనుకుంటే అండమాన్ నికోబార్ దీవులు ఎంజాయ్ చేయడానికి బెస్ట్.

గోకర్ణ, కర్ణాటకలో ఉన్న అద్భుతమైన ప్రదేశం ఇది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో, అదిరిపోయే బీచ్‌లలో న్యూ ఇయర్ ఎంజాయ్ చేయవచ్చు.

అలాగే మహారాష్ట్రాలో కూడా అందమైన బీచ్‌లు ఉన్నాయి. అందులో అలీ బాగ్ ఒకటి. ముంబైకి దగ్గరగా ఉండే ఈ బీచ్, ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్.

పశ్చిమ బెంగాల్‌లో ఉన్న అందమైన బీచ్‌లలో మందర్మణి. ఇక్కడ చాలా తక్కువ జన సమూహంతో ఉండే ఈ బీచ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు బెస్ట్ ప్లేస్.

ప్రతి ఒక్కరూ సందర్శించాలి అనుకునే అద్భుతమైన ప్రదేశాల్లో లక్షద్వీప్ కూడా ఒకటి. ఇక్కడి పగడపు దిబ్బలు మీకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి.