24 December 2025

50 ఏళ్ల వయసులో ఎలా ఫిట్‏గా ఉన్నారు.. ? శిల్పా శెట్టి ఏం చెప్పిందంటే

Rajitha Chanti

Pic credit - Instagram

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఈ వయసులోనూ పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తుంది.

తాజాగా తన ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తన లుక్, శరీరాకృతి వెనుక కఠినమైన వ్యాయమం, ఆహారపు అలవాట్లు ఉన్నాయని అంటుంది. 

రోజూ ఉదయాన్నే నోని జ్యూస్, ఒకటిన్నర గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుంటుందట. అలాగే ఆయుర్వేద పద్దతిలో ఆయిల్ పుల్లింగ్ పద్దతిని ఫాలో అవుతుదంట.

అలాగే నూనెను రోజూ దంతాల చుట్టూ 20 నిమిషాలపాటు రుద్దుతుందట. ఇది నోటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని.. అందుకు కొబ్బరి నూనె ఉపయోగిస్తుందట.

అలాగే కొన్నిసార్లు కలబంద రసంతో తన రోజును ప్రారంభిస్తానని అంటుంది. కలబంద రసం, తులసి ఆకులు, బెల్లం, అల్లం కలిపి తయారు చేసిన రసం తీసుకుంటుంది.

పండ్లు, ఓట్స్, ముయెస్లీ వంటి అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను ఎంచుకుంటుంది. బాదం పాలు, ఓట్స్, తేనె, అరటిపండు, ఇతర పండ్లతో బ్రేక్ ఫాస్ట్ చేస్తుంది.

గుడ్లు, అవకాడో, వెన్నతో చేసిన గోధుమ టోస్ట్ తీసుకుంటుంది. చక్కరకు బదులుగా తేనె లేదా బెల్లంపొడి, సహజ స్వీటెనర్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది శిల్పా.

 డైట్ ఫ్యాడ్స్, ఎక్కువ వేయించిన ఆహారాన్ని తీసుకోదు. కూరగాయలు, పండ్లు, చపాతీ, చికెన్, పప్పు వంటి ఆహారాన్ని తీసుకుంటుంది. ప్రోటీన్ ఉండేలా చూసుకుంటుంది.