AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Anganwadi Jobs 2025: పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో.. ఒప్పం ద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్‌, హెల్పర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఏపీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ (AP WCD) ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద..

AP Anganwadi Jobs 2025: పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
Andhra Pradesh WCD Anganwadi Jobs
Srilakshmi C
|

Updated on: Dec 24, 2025 | 4:13 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్‌, హెల్పర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఏపీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ (AP WCD) ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 92 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో అంగన్వాడీ (హెల్పర్‌) ఖాళీలు 14, అంగన్వాడీ వర్కర్‌ ఖాళీలు 78 వరకు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా డిసెంబర్‌ 24వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 జులై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు స్థానిక అవివాహితులుగా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్‌ 31, 2025వ తేదీలో స్థానిక సీడీపీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులు తమతోపాటు కులం సర్టిఫికెట్‌, నివాసం, పుట్టిన తేదీ, పదో తరగతి మార్క్స్ మెమో, ఆధార్‌, వికలాంగులైతే వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లను గెజిట్‌ అధికారితో ధృవీకరణ పొందిన జిరాక్స్‌ కాపీలను దరఖాస్తుతోపాటు జత చేయాలి.

ఒకవేళ అభ్యర్ధులు ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి పాసై ఉంటే తప్పనిసరిగా టీసీ/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్‌లో పాస్‌ కావాలి. కులం, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు కార్యాలయం జారీచేసిన పత్రములను ఏదేని గెజిటెడ్ అధికారిచే దృవీకరణ చేసినవి జతపరచాలి. దరఖాస్తులో లేటెస్ట్‌ పాస్‌ ఫోటోను ముందు భాగంలో అతికించి, ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకం చేయాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు పోస్టులను రూ.7,000 నుంచి రూ.11,500 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

ఏపీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
టెన్త్ స్టూడెంట్స్‌కు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు..
టెన్త్ స్టూడెంట్స్‌కు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు..
ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. కాసేపటికే
ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. కాసేపటికే
రికార్డు సెంచరీతో గంభీర్, అగార్కర్‌లకు ఇచ్చిపడేసిన రోహిత్..
రికార్డు సెంచరీతో గంభీర్, అగార్కర్‌లకు ఇచ్చిపడేసిన రోహిత్..
ప్రపంచంలోనే మూడో స్థానానికి వెండి.. ఆపడం ఇక కష్టమే బాసూ
ప్రపంచంలోనే మూడో స్థానానికి వెండి.. ఆపడం ఇక కష్టమే బాసూ