24 December 2025

సొంతంగా ఐలాండ్ ఉన్న ఏకైక హీరోయిన్.. చేసిన సినిమాలు తక్కువే..

Rajitha Chanti

Pic credit - Instagram

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి గుర్తింపు తెచ్చుకుంది.

స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్ కాగా.. ఎక్కువగా గ్లామరస్ పాటలతోనే ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ నెట్టింట చాలా యాక్టివ్ ఈ బ్యూటీ.

15 సంవత్సరాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న ఈ బ్యూటీ.. బహ్రెయిన్ లోని మహానాలో జన్మించారు. ఆమె శ్రీలంకకు సంతతి చెందిన అమ్మాయి.

ఆస్ట్రేలియాలో మాస్ కమ్యునికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత శ్రీలంకలోని ఓ న్యూస్ ఛానల్లో రిపోర్టర్ గా పనిచేస్తూ కెరీర్ ప్రారంభించింది. 

రిపోర్టర్ గా పనిచేస్తూనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2006లో మిస్ శ్రీలంక టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత అనేక మోడలింగ్ ఆఫర్స్ వచ్చాయి.

2009 నుంచి సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. 2011లో వచ్చిన మర్డర్ 2 సినిమాతో ఆమెకు గుర్తింపు వచ్చింది. తర్వాత హిందీలో వరుస సినిమాల్లో నటించింది. 

2012లో ఆమె శ్రీలంక తీరంలో 4 ఎకరాల ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఆ ఐలాండ్ విలువ రూ.3 కోట్లు అని టాక్.

ముంబైలోని పాలి ప్రాంతంలో ఆమెకు సొంత విల్లా ఉంది. అలాగే ఆమె వద్ద రేంజ్ రోవర్ వోగ్, హమ్మర్ H2, BMW 5 సిరీస్, జీప్ కంపాస్ వంటి కార్లు ఉన్నాయి.