AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సప్ యూజర్స్... బీ అలర్ట్... ఘోస్ట్‌ పెయిరింగ్‌‌కు చెక్ పెట్టండిలా

వాట్సప్ యూజర్స్… బీ అలర్ట్… ఘోస్ట్‌ పెయిరింగ్‌‌కు చెక్ పెట్టండిలా

Phani CH
|

Updated on: Dec 24, 2025 | 1:31 PM

Share

హైదరాబాద్ సీపీ సజ్జనార్ వాట్సాప్‌లో ‘ఘోస్ట్ పెయిరింగ్’ అనే కొత్త స్కామ్ గురించి హెచ్చరించారు. అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయడం ద్వారా హ్యాకర్లు మీ వ్యక్తిగత డేటాను దొంగిలించి, మోసాలకు పాల్పడుతారు. మీ వాట్సాప్ ఖాతా సురక్షితంగా ఉండాలంటే, 'Linked Devices' తనిఖీ చేసి, తెలియని డివైజ్‌లను తొలగించండి. అలాగే, టూ-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసి, సైబర్ నేరాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

హైదరాబాద్ సీపీ సజ్జనార్ వాట్సాప్‌లో ‘ఘోస్ట్ పెయిరింగ్’ పేరుతో కొత్త స్కామ్ జరుగుతోందని హెచ్చరించారు. ‘హేయ్.. మీ ఫోటో చూశారా? మీ గురించి ఎవరో ఇలా రాశారు..? అంటూ మీ వాట్సాప్‌కు ఏదైనా లింక్ వచ్చిందా? అది మీ స్నేహితులు లేదా బంధువుల నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయవద్దనీ అలా చేస్తే హ్యాకర్ల డివైజ్‌కు మీ అకౌంట్ కనెక్ట్ అయి, మీ పర్సనల్ డేటాను దుర్వినియోగం చేసి మోసాలకు పాల్పడతారని తెలిపారు. వాట్సాప్ సెట్టింగ్స్‌లోని ‘Linked Devices’ ఆప్షన్‌ను పరిశీలించి, తెలియని డివైజ్‌లను తొలగించుకోవాలని సూచించారు. మీరు చేసే ఆ ఒక్క క్లిక్ మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్ల పరం చేస్తుందని సజ్జనార్ హెచ్చరించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ‘ఘోస్ట్ పేయిరింగ్’ అనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి ప్రజలను దోచుకుంటున్న‌ట్లు స‌జ్జ‌న్నార్ తెలిపాడు. అసలేమిటీ ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్? సాధారణంగా మనం వాట్సాప్ వెబ్‌ను కనెక్ట్ చేయాలంటే QR కోడ్ స్కాన్ చేయాలి లేదా OTP ఎంటర్ చేయాలి. కానీ ఈ మోసంలో హ్యాకర్లు పంపిన లింక్‌ను మీరు క్లిక్ చేయగానే ఒక నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. మీరు ఆ పేజీని చూడగానే, మీకు తెలియకుండానే మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్ లేదా Pair అయిపోతుంది. దీని కోసం వారికి మీ ఫోన్ భౌతికంగా అవసరం లేదు, కనీసం OTP కూడా అడగరు. అందుకే దీన్ని ‘ఘోస్ట్ పేయిరింగ్’ అని పిలుస్తున్నారు. వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతికి చిక్కితే ఏం జరుగుతుందంటే.. మీ చాటింగ్స్, పర్సనల్ ఫోటోలు, వీడియోలు అన్నీ హ్యాకర్లు చూసేస్తారు. మీ కాంటాక్ట్ లిస్ట్ దొంగిలించి, మీ పేరుతో ఇతరులకు మెసేజ్ లు పంపి డబ్బులు అడుగుతారు. చివరకు మీ వాట్సాప్ ఖాతాను మీరే వాడలేకుండా వారు లాక్ చేసే ప్రమాదం ఉంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి లేదా అనుమానాస్పద నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి లింకులను క్లిక్ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పొరపాటున లింక్ ఓపెన్ చేసినా, మీ వాట్సాప్ సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వెంటనే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Linked Devices’ ఆప్షన్‌ను తరచూ తనిఖీ చేస్తూ ఉండాలని కోరారు. అక్కడ మీకు తెలియని లేదా మీది కాని వేరే ఏదైనా డివైజ్ లాగిన్ అయి కనిపిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దానిని ‘Logout’ చేయాలని హెచ్చరించారు. అకౌంట్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ ఖాతాలో ‘Two-step verification’ ఫీచర్‌ను తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలని సూచించారు. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా, మన చిన్నపాటి అజాగ్రత్తే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతుందని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే సైబర్ సెక్యూరిటీ పట్ల ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని, ఈ సమాచారాన్ని తన కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయడం ద్వారా వారిని కూడా ప్రమాదాల బారిన పడకుండా కాపాడవచ్చని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhurandhar: ధురంధర్ కలెక్షన్స్‌లో షేర్ కావాలి! పాకిస్తానీల వింత డిమాండ్

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు

Champion: రిలీజ్‌కు ముందే ఛాంపియన్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్

చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

రైలు ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఛార్జీలు