రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ పంచవటి కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం ఓ యాక్టివా స్కూటీని ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.