సాధారణంగా చలికాలం జీర్ణ శక్తి కాస్త మందగిస్తుంది. అలాంటి సమయాల్లో గోరు వెచ్చని నీరు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఈ నీరు తీసుకుంటే మలబద్ధకం దూరమవుతుంది.
చలికాలంలో ఎదురయ్యే మరో ప్రధాన సమస్య ఒంటి నొప్పులు. వీటికి కూడా గోరు వెచ్చని నీరు బెస్ట్ రెమెడీగా పనిచేస్తుంది. శరీరంలో రక్తసరఫరా పెరగడం వల్ల ఒంటి నొప్పులు దూరమవుతాయి.
ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలో టాక్సిన్లు అన్నీ దూరమవుతాయని, కిడ్నీలు క్లీన్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
చలికాలం తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటాం. దీంతో ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంటుంది. అయితే గోరు వెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి, బరువు తగ్గడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ముక్కు దిబ్బడం, ఊపిరిత్తుల్లో శ్లేష్మం చేరడం వంటి ఎన్నో సమస్యలకు వేడి నీరు దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పడగడుపున తాగితే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది.
చలికాలంలో గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిందే. అయితే గోరు వెచ్చని నీరు తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో తలెత్తే గొంతు నొప్పి సమస్యకు కూడా గోరువెచ్చని నీరు దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నీటిలో తేనె వేసుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.