ఎండగా ఉన్నప్పుడు రోడ్డు పక్కన కనిపించే చెరకు రసం బండిని చూస్తే అమృతం దొరికినంత ఆనందమేస్తుంది. మండే ఎండల్లో ఓ గ్లాసు చల్లని చెరకు రసం తాగితే హాయిగా అనిపిస్తుంది. క్షణాల్లో శరీరం ఉత్తేజితమవుతుంది
TV9 Telugu
చెరకు రసంలో కాస్తంత అల్లం, నిమ్మరసం తగిలించిజజ తాగితే అలసట, నీరసం మాయమై శరీరం శక్తిని పుంజుకుంటుంది. ఇలా ఆరోగ్యానికే కాదు.. అందానికి, కేశ సౌందర్యానికి కూడా బలేగా మేలు చేస్తుంది
TV9 Telugu
చెరకులో పిండిపదార్థాలు, మాంసకృత్తులతోపాటు పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్ లాంటి ఖనిజాలుంటాయి. విటమిన్-ఎ, బి, సి కూడా ఎక్కువే
TV9 Telugu
ఇది అలసట, నిస్సత్తువను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. దీనిలోని ఖనిజాలు దంతాలు, ఎముకలకు బలాన్నిస్తాయి. మలబద్ధకాన్ని పారదోలుతుంది
TV9 Telugu
మీకు తెలుసా.. చెరకు రసాన్ని పాలల్లో కలిపి కూడా తాగొచ్చు. చాలా మందికి దీని గురించి తెలియదు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
చెరకు రసంలో పాలు, నిమ్మకాయ రసం, అల్లం కలిపి తరచూ తాగడం మంచిది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది
TV9 Telugu
మలబద్ధకం సమస్యతో బాధపడేవారు వారానికోసారి ఇలా చేసి చెరకు పాలు తాగాలి. అంతేకాడు కాలేయం ఆరోగ్యంగా ఉండాలన్నా ఇలా పక్షం రోజులకు ఒకసారి చెరుకు రసాన్ని సేవించాలి
TV9 Telugu
నోటి పుండ్లతో బాధపడే వారు కూడా ఈ ద్రవం తాగితే మళ్లీ మళ్లీ ఈ సమస్య దరిచేరదు. క్రమం తప్పకుండా తాగితే రోగనిరోధకత పెరుగుతుంది. నోటి దుర్వాసనను తగ్గించి దంతసమస్యలను నిర్మూలిస్తుంది