యూరిక్ యాసిడ్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ మసాలా నీరు బెస్ట్ మెడిసిన్ 

23 November 2024

 Pic credit - Getty

TV9 Telugu

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కాళ్లలో విపరీతమైన నొప్పులు, వాపులు, అలసట, కిడ్నీలో రాళ్లు మూత్రంలో రక్తం, నడుము, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

యూరిక్ యాసిడ్ లక్షణాలు

యూరిక్ యాసిడ్ పెరిగి.. నియంత్రించలేక పొతే మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది ఆర్థరైటిస్‌కు కూడా దారి తీస్తుంది.

వచ్చే వ్యాధులు 

యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే.. దీని నివారణ మీ వంటగదిలోని సుగంధ ద్రవ్యాలు పనిచేస్తాయి. నిపుణులు చెప్పిన దివ్య ఔషదం ఏమిటో తెలుసా.. 

వంటిల్లే ఔషధ గని 

వాము వాటర్ లేదా వాము ఆకు నీటిని తాగడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా చెప్పారు. అయితే సంయమనం కూడా ముఖ్యమని అన్నారు. 

నిపుణుల సలహా 

ఖాళీ కడుపుతో వాము నీరు తాగడంతోపాటు జీలకర్ర, కొత్తిమీర, మెంతి నీళ్లను తాగడం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్‌ స్థాయి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

సుగంధ ద్రవ్యాల నీరు 

యూరిక్ యాసిడ్‌ను నియంత్రించుకోవాలనుకుంటే తినే ఆహారం విషయంలో కంట్రోల్ చాలా ముఖ్యం. నాన్ వెజ్, అధిక ప్రోటీన్ పప్పులు, ప్యూరిన్ రిచ్ ఫుడ్స్, డ్రై మ్యాంగో పౌడర్, చింతపండుకు దూరంగా ఉండాలి.

ఈ ఆహారాన్ని తినొద్దు 

యూరిక్ యాసిడ్‌ స్థాయిని నియంత్రించుకోవాలనుకుంటే రోజూ పుష్కలంగా నీరు త్రాగాలి. అంతేకాదు అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి. రోజూ కొంత సమయం వ్యాయామం చేయాలి.

దినచర్య ఎలా ఉండాలంటే