న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ 2024
News9 Global Summit 2024 : TV9 నెట్‌వర్క్‌కు చెందిన న్యూస్9 ఆధ్వర్యంలో జర్మనీలోని స్టుట్‌గాట్ నగరంలో గ్లోబల్ సమ్మిట్ 2024కు శ్రీకారం చుట్టింది. భారత్- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది. నవంబర్ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. TV9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ అధ్యక్షతన జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. ఈ సమ్మిట్‌లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అలాగే జర్మనీకి చెందిన మంత్రులు, ప్రతినిధులు, ఇరు దేశాల రాజకీయ, వాణిజ్య, క్రీడా, సినీ ప్రముఖులు దాదాపు 200 మంది పాల్గొని కీలక అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు.