AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 Global Summit 2025: ఆయుధాలు కాదు.. ఈ మూడు ఉంటేనే యుద్ధంలో గెలుపు సాధ్యం.. న్యూస్9 సమ్మిట్‌లో డాక్టర్ వివేక్ లాల్..

మారుతున్న ప్రపంచ పరిస్థితులు, పెరుగుతున్న ముప్పులను దృష్టిలో ఉంచుకుని, రక్షణ వ్యవస్థకు మూడు ముఖ్య స్తంభాలు అవసరమని డాక్టర్ వివేక్ లాల్ నొక్కి చెప్పారు. భద్రత, స్థిరత్వం, స్కేలబిలిటీని మూడు ముఖ్య అంశాలుగా తెలిపారు. రక్షణ రంగంలో స్థిరత్వం కోసం వ్యూహాత్మక అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

News9 Global Summit 2025: ఆయుధాలు కాదు.. ఈ మూడు ఉంటేనే యుద్ధంలో గెలుపు సాధ్యం.. న్యూస్9 సమ్మిట్‌లో డాక్టర్ వివేక్ లాల్..
Dr. Vivek Lal At News9 Global Summit 2025
Krishna S
|

Updated on: Oct 10, 2025 | 12:49 PM

Share

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులు, మారుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో రక్షణ రంగంలో ఆవిష్కరణలు, సహకారం యొక్క పాత పద్ధతులు సరిపోవని జనరల్ అటామిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ సీఈవో డాక్టర్ వివేక్ లాల్ స్పష్టం చేశారు. జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరిగిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. రక్షణ ఆవిష్కరణల భవిష్యత్తుపై తన దార్శనికతను పంచుకున్నారు. ఆయన ప్రపంచంలోనే టాప్ స్పేస్ అండ్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌లలో ఒకరు.

పోటీ యుగంలో కొత్త ముప్పులు

భౌగోళిక రాజకీయ దృశ్యం మారుతోందని లాల్ అన్నారు. టెర్రరిస్టు గ్రూప్‌ల లాంటివాటి నుండి ఊహించని ముప్పులు వస్తున్నాయని.. స్పేస్, సైబర్ స్పేస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ వంటివన్నీ ఇప్పుడు యుద్ధభూములుగా మారాయని చెప్పారు. పాత సహకారం కాదు, భద్రత, స్థిరత్వం, స్కేలబిలిటీ అనే మూడు పిల్లర్స్ కలిసిన కొత్త ప్లాన్ కావాలని నొక్కి చెప్పారు.

భద్రతే అన్నింటికీ పునాది

డాక్టర్ లాల్ దృష్టిలో భద్రత అన్నింటికీ పునాదిగా ఉండాలి. కేవలం ఆయుధాలు, ప్లాట్‌ఫామ్స్ కాదు.. మన రక్షణను స్వీయ-రక్షణ నెట్‌వర్క్‌లుగా మార్చాలి అని సూచించారు. అంటే ముప్పును త్వరగా గుర్తించి, ఆటోమేటిక్‌గా రిపేర్ చేసుకునే సిస్టమ్స్ కావాలి. చిప్ డిజైన్, కమ్యూనికేషన్స్, తయారీ అన్నింటిలోనూ బేసిక్ లెవల్ నుంచే సెక్యూరిటీని బిల్డ్ చేయాలి. టెక్నాలజీ ఒక్కటే చాలదు.. పొలిటికల్ సపోర్ట్, టీమ్ వర్క్ కూడా ఉండాలి.

వ్యూహాత్మక అవసరం

రక్షణ అంటే విధ్వంసం కాదని.. స్థిరత్వం కూడా ఉండాలని లాల్ అన్నారు. ముప్పులు బోర్డర్‌ను పట్టించుకోవు. అందుకే, అన్ని దేశాలు కలిసి, ఒకరిపై ఒకరు నమ్మకంతో పనిచేయాలి. “ఏ దేశం కూడా ఒంటరిగా ఉండకూడదు” అని అన్నారు. “పచ్చదనం – రక్షణ కలిసి ఉండగలవా? అనే ప్రశ్నకు ఆయన ఉండాలి అని బలంగా సమాధానమిచ్చారు.

లాల్ స్టెబిలిటీని మూడు అంశాలుగా విభజించారు:

  • హైబ్రిడ్ ప్రొపల్షన్, ప్రత్యామ్నాయ ఇంధనాలలో పురోగతిపై దృష్టి పెట్టాలి.
  • సరఫరా గొలుసుల స్థిరత్వం
  • ప్రమాణాల స్థిరత్వం

లాజిస్టికల్ లోపాలు, వ్యర్థాలను తగ్గించే రేడియేషన్ తట్టుకునే ఉపగ్రహ డిజైన్‌లపై పనిచేయడం ద్వారా వనరుల స్థిరత్వాన్ని సాధించవచ్చని డాక్టర్ లాల్ తెలిపారు. ఈ సమ్మిట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ రక్షణ వ్యూహాలపై కొత్త ఆలోచనలకు నాంది పలికాయి.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?