News9 Global Summit 2025: ‘కలలకు లింగ భేదం లేదు.. ఆలోచన మారనంత వరకు ఏదీ మారదు’ టీవీ9 గ్లోబల్ సమ్మిట్‌లో మహిళా లీడర్లు
బోర్డు రూమ్‌లో మహిళలు ఉండటం మాత్రమే సరిపోదు. కానీ వారికి సమాన అవకాశాలు, నిర్ణయం తీసుకునే శక్తిని ఇవ్వడం ముఖ్యమని డాక్టర్ సరితా ఐలావత్ అన్నారు. గురువారం (అక్టోబర్ 9) జర్మనీలో జరిగిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ 2025 సెకండ్ ఎడిషన్ లో ప్రభావవంతమైన మహిళా లీడర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా..

న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ 2025 సెకండ్ ఎడిషన్ గురువారం (అక్టోబర్ 9) జర్మనీలో ప్రారంభమైంది. భారత్, జర్మనీ నుంచి నలుగురు ప్రభావవంతమైన మహిళలు ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. కెప్టెన్ జోయా అగర్వాల్ (ఎయిర్ ఇండియా సీనియర్ కమాండర్), డాక్టర్ సరితా ఐలావత్ (బాట్ ల్యాబ్ డైనమిక్స్ కో ఫౌండర్), వెనెస్సా బాచోఫర్ (మేనేజింగ్ డైరెక్టర్, మార్క్ అండ్ ష్నైడర్ GmbH), ఎవెలిన్ డి గ్రూటర్ (జర్మన్ మహిళా వ్యవస్థాపకుల సంఘం మేనేజింగ్ డైరెక్టర్).. Strength to Strength: Women in Leadership అనే అంశంపై ఈ నలుగురు శక్తివంతమైన మహిళలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మహిళల భాగస్వామ్యం లేకుంటే నిజమైన ప్రాతినిధ్యం సాధ్యం కాదు.. డాక్టర్ సరితా ఐలావత్
బోర్డు రూమ్‌లో మహిళలు ఉండటం మాత్రమే సరిపోదు. కానీ వారికి సమాన అవకాశాలు, నిర్ణయం తీసుకునే శక్తిని ఇవ్వడం ముఖ్యమని డాక్టర్ సరితా ఐలావత్ అన్నారు. తన స్టార్టప్ బాట్ ల్యాబ్ డైనమిక్స్ IIT ఢిల్లీతో అనుబంధంగా ఉందని, ప్రపంచంలోని అగ్రశ్రేణి డ్రోన్ కంపెనీలలో ఒకటి అని ఆమె అన్నారు. మనం ఒకేసారి వేలాది డ్రోన్‌లను ఎగురవేయగలం. కానీ 250 మంది ఇంజనీర్ల బృందంలో కేవలం మహిళల సంఖ్య 10% కంటే తక్కువగా ఉందని ఆమె అన్నారు. మహిళల భాగస్వామ్యం 50:50 నిష్పత్తిలో లేకపోతే నిజమైన ప్రాతినిధ్యం సాధ్యం కాదని పేర్కొన్నారు.
వచ్చే పదేళ్లలో లక్ష ఉద్యోగాలు.. వెనెస్సా బాచోఫర్
తాను పని చేస్తున్న రంగంలో 75% మంది మహిళలు పనిచేస్తున్నారు. కానీ వారిలో సగం మంది పార్ట్ టైమ్ ఉద్యోగులు. ప్రస్తుతం దాదాపు 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాబోయే దశాబ్దంలో ఈ సంఖ్య లక్షకి చేరుకుంటుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మహిళలు పూర్తి సమయం పనిచేయడం చాలా అవసరమని ఆమె అన్నారు. సౌకర్యవంతమైన పని నమూనాలు, నమ్మకమైన డేకేర్, నాయకత్వ రోల్స్‌లో ఎక్కువ మంది మహిళల అవసరం ఉందని వెనెస్సా అన్నారు.
కలలకు లింగం లేదు.. కెప్టెన్ జోయా అగర్వాల్
నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు నా సంస్థలో ఐదవ అతి పిన్న వయస్కురాలిని. నన్ను నేను నిరూపించుకోవడానికి పురుష సహోద్యోగుల కంటే 200% కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. కానీ ప్రశ్న ఏమిటంటే మహిళలు మాత్రమే ఇలా ఎందుకు చేయాలి? నిజమైన మార్పు మన ఆలోచనతోనే ప్రారంభమవుతుందని ఆమె అన్నారు. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తేడాను మనం ఆపివేసే వరకు ఏమీ మారదు. గుర్తుంచుకోండి కలలకు లింగం లేదు అని జోయా అగర్వాల్ చెప్పారు,
కార్పొరేట్ సంస్కృతి మారాలి.. ఎవెలిన్ డి గ్రూటర్
జర్మనీలో మహిళలు పని చేయడానికి, బ్యాంకు ఖాతా తెరవడానికి ఇప్పటికీ తమ భర్త అనుమతి తీసుకునే కాలంలో అంటే 1950లలో తన సంస్థ స్థాపించబడిందని ఎవెలిన్ డి గ్రూటర్ వివరించారు. చాలా మారిపోయింది, కానీ చాలా అడ్డంకులు ఛేదించాల్సి ఉంది. బోర్డులలో మహిళలను కలిగి ఉండటం మాత్రమే సరిపోదు. కార్పొరేట్ సంస్కృతి కూడా మారాలని ఆమె అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




