AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశ ముఖచిత్రం మారుతోందిః అనురాగ్ ఠాకూర్

ఉగ్రవాదంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించారు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్. ఉగ్రవాదం విషయంలో ప్రపంచం ద్వంద్వ ప్రమాణాలను సహించదని మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఏలాంటి ఉగ్రవాద దాడికైనా భారతదేశం ప్రతిస్పందిస్తుంది. పొరుగు దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని అనురాగ్ ఠాకూర్ అన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశ ముఖచిత్రం మారుతోందిః అనురాగ్ ఠాకూర్
Bjp Mp Anurag Thakur
Balaraju Goud
|

Updated on: Oct 09, 2025 | 5:14 PM

Share

దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 అధ్వర్యంలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మనీలో కొనసాగుతోంది. అతిపెద్ద శిఖరాగ్ర సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి కొత్త స్వరాన్ని ఇచ్చారని అన్నారు. భారతదేశం ముఖచిత్రం మారిపోయింది. కొత్త భారతదేశం ఇప్పుడు ఆవిష్కరణలు, స్టార్టప్‌లతో గుర్తింపు సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అన్నిరంగాల్లో పెరుగుదలను నమోదు చేసుకుంటోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ఇప్పుడు కొత్త ప్రపంచ క్రమాన్ని సృష్టిస్తోందని ఠాకూర్ అన్నారు.

టీవీ9 న్యూ్స్ నెట్‌వర్క్ జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ రెండవ ఎడిషన్ నిర్వహిస్తోంది. గత నవంబర్‌లో టీవీ9 నెట్‌వర్క్ బుండెస్లిగా జట్టు, VfB స్టట్‌గార్ట్ సహకారంతో స్టట్‌గార్ట్ మొదటి ఎడిషన్‌ను నిర్వహించింది. గత సంవత్సరం, గ్లోబల్ సమ్మిట్ “భారత్-జర్మనీ: స్థిరమైన వృద్ధికి ఒక రోడ్‌మ్యాప్” అనే థీమ్‌తో జరిగింది. ఈ సంవత్సరం సమ్మిట్ “ప్రజాస్వామ్యం, జనాభా, అభివృద్ధి: భారతదేశం-జర్మనీ కనెక్ట్” అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.

భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా అవతరించిందని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. భారతదేశం త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. మనకు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న బలమైన, స్థిరమైన ప్రభుత్వం ఉంది” అని బీజేపీ ఎంపీ అన్నారు. భారతదేశం కొత్త ప్రపంచ క్రమాన్ని నిర్మిస్తోందని ఆయన అన్నారు.

న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ 2025లో మాట్లాడుతూ, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావించారు. “కొంతకాలం క్రితం పహల్గామ్‌లో ఘోరమైన ఉగ్రవాద దాడిని ఎదుర్కొన్నాము. ఉగ్రవాదులు చంపే ముందు మతం గురించి అడిగే ధైర్యం చేశారు. ఈ దాడి వెనుక ఏ దేశం ఉందో మీ అందరికీ తెలుసు” అని అన్నారు. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరిని ప్రస్తావిస్తూ, ఉగ్రవాదం విషయంలో ప్రపంచం ద్వంద్వ ప్రమాణాలను సహించదని ఆయన అన్నారు. ఏలాంటి ఉగ్రవాద దాడికైనా భారతదేశం ప్రతిస్పందిస్తుంది. పాకిస్తాన్ పేరు చెప్పకుండానే, భారతదేశం పొరుగు దేశం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మారుతోందని ఆయన అన్నారు. భారతదేశం ప్రపంచ గుర్తింపు మారుతోంది. భారతదేశం ఇప్పుడు ఆవిష్కరణలు, స్టార్టప్‌లతో ప్రపంచాన్ని శాసిస్తోందన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..