3 బంతుల్లో 30 పరుగులు ఇచ్చిన స్టార్ బౌలర్.. కట్‌చేస్తే.. ఫిక్సింగ్ చేశాడంటూ ఫ్యాన్స్ ఫైర్.. ఎవరంటే?
Dasun Shanaka spent 30 runs in 3 balls in Abu Dhabi T10 match: శ్రీలంక మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ దాసున్ షనకపై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. అబుదాబి టీ-10 లీగ్‌లో ఆడుతున్న షనక.. చివరి ఓవర్లో చేసిన ఓ ఘోర తప్పిదంతో అడ్డంగా దొరికాడు. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..
Dasun Shanaka spent 30 runs in 3 balls in Abu Dhabi T10 match: శ్రీలంక మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ దాసున్ షనక వార్తల్లో నిలిచాడు. దీనికి కారణం సానుకూలమైనది మాత్రం కాదండోయ్. వాస్తవానికి, అబుదాబి టీ-10 లీగ్‌లో ఆడుతున్న షనక విషయంలో ఊహించనిది చోటు చేసుకుంది. ఆ తర్వాత అతనిని ఫిక్సింగ్ చేశాడంటూ ఆరోపణలు గుప్పతిస్తున్నారు. అత్యధికంగా 48 టీ-20 ఇంటర్నేషనల్స్‌లో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన షనక గత ఏడాది మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు వచ్చిన ఈ ఆరోపణలు ఆయన ప్రతిష్టను దిగజార్చాయి. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..
దసున్ షనక 3 బంతుల్లో 30 పరుగులు..
ఢిల్లీ బుల్స్‌తో జరిగిన 10 ఓవర్ల మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన షనక.. తొలి మూడు బంతుల్లో 30 పరుగులు ఇచ్చాడు. ఇందులో నాలుగు నో బాల్స్ సంధించాడు.
ఫిక్సింగ్ చేశారని ఆరోపించిన ఫ్యాన్స్..
ఈ ఓవర్ తర్వాత, సోషల్ మీడియాలో అతనిని ఫిక్సింగ్ చేశాడంటూ ఆరోపించడం మొదలుపెట్టారు. 4 నోబాల్స్ వేయడమే ఇందుకు కారణం అంటూ చెబుతున్నారు.
Dasun Shanaka – 4 No balls in an over. @ICC This T10 league is becoming a joke and all kind of chances for fixing. 33 runs and 4 no balls from a player like Shanaka!! pic.twitter.com/zll01wjACx
— Sandeep (@sandeep_Vishu) November 25, 2024
ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, “స్పష్టంగా ఇవి నో-బాల్స. ఈ లీగ్‌లను ICC దర్యాప్తు చేయాలి. ప్రస్తుతం దసున్ షనక శ్రీలంక కెప్టెన్‌గా ఉండటం చాలా విచిత్రం.” అంటూ రాసుకొచ్చాడు.
Well done dasun shanaka maan gaye bhai no balls ki line lagadi 33 runs in 1 over 😂 pic.twitter.com/FakZTXqxUc
— SAGAR THE TIPSTER (@GunjkarSagar) November 25, 2024
మరో వినియోగదారు “అబుదాబి T10 లీగ్‌లో ఇలా కూడా ఫిక్సింగ్ ఉంటుందా? దాసున్ షనక ఒక ఓవర్‌లో నాలుగు నో-బాల్‌లు వేయడమేంటి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతను శ్రీలంకకు ఎప్పుడూ నో-బాల్ వేయలేదు” అంటూ తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..