RCB Playing XI: కెప్టెన్ లేకుండా ఫిక్స్ అయిన ఆర్సీబీ ప్లేయింగ్ 11.. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దంచుడే..

IPL 2025 Royal Challengers Bengaluru Playing 11 Prediction: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జట్టు ఐపీఎల్ మెగా వేలంలో ఐపీఎల్ 2025 కోసం బలమైన జట్టును సిద్ధం చేసింది. ఓపెనర్ల నుంచి ఫినిషర్ల వరకు ఆచితూచి ఎంచుకున్నారు. ఈమేరకు ఆర్సీబీ బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..

RCB Playing XI: కెప్టెన్ లేకుండా ఫిక్స్ అయిన ఆర్సీబీ ప్లేయింగ్ 11.. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దంచుడే..
Rcb Ipl 2025 Playing Xi
Follow us
Venkata Chari

|

Updated on: Nov 26, 2024 | 4:25 PM

IPL 2025 Royal Challengers Bengaluru Playing XI Prediction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్ కోసం వేలం ముగిసింది. అన్ని జట్లు తమ అత్యుత్తమ జట్టును తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) వేలానికి ముందు విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యష్ దయాల్‌లను మాత్రమే రిటైన్ చేసుకుంది. వేలంలో చాలా మంది పాత ఆటగాళ్లను వెనక్కి తీసుకురాకపోవడంతో ఈసారి కొత్త జట్టును సిద్ధం చేసింది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌, విల్‌ జాక్వెస్‌ వంటి ఆల్‌రౌండర్లను ఆర్‌సీబీ వదులుకుంది.

అయితే, ఈసారి విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను ఓపెనింగ్ చేయగల ఫిల్ సాల్ట్ వంటి బలమైన ఓపెనర్‌ను కొనుగోలు చేశారు. ఇటువంటి పరిస్థితిలో, RCB నలుగురు పవర్ ఫుల్ బ్యాట్స్‌మెన్‌లను, ఇద్దరు ఆల్‌రౌండర్‌లను బరిలోకి దించే అవకాశం ఉంది. రజత్ పాటిదార్‌ను మూడో స్థానంలోనూ, లియామ్ లివింగ్‌స్టోన్‌ను నాలుగో స్థానంలోనూ బ్యాటింగ్ చేయించవచ్చు. ఆ తర్వాత, జితేష్ శర్మ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా మారవచ్చు. టిమ్ డేవిడ్ ఫినిషర్‌గా మారవచ్చు. గత సీజన్‌లో ఆకట్టుకున్న స్వప్నిల్ సింగ్, కృనాల్ పాండ్యాలను ఆల్‌రౌండర్‌లుగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి, ఎనిమిదో నంబర్‌ వరకు బ్యాటింగ్‌కు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బౌలింగ్ గురించి మాట్లాడితే, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్‌లతో పాటు, యష్ దయాల్‌ను ఫాస్ట్ బౌలర్‌గా ప్లేయింగ్ ఎలెవెన్‌లో భాగం చేయవచ్చు. ఇటువంటి ప్లేయింగ్ ఎలెవన్‌లో, RCB బ్యాటింగ్‌లో ఎనిమిది ఎంపికలు, బౌలింగ్‌లో కనీసం ఆరు ఎంపికలను కలిగి ఉంటుంది. స్వస్తిక్ చికారా, సుయాష్ శర్మలను ఇంపాక్ట్ ప్లేయర్‌లుగా RCB బాగా ఉపయోగించుకోగలదు. చిన్నస్వామి చాలా పెద్ద షాట్లు కొట్టడంలో ప్రసిద్ధి చెందినందున స్వస్తిక్‌ను ప్రత్యేకంగా ఉపయోగించవచ్చు. లెగ్ స్పిన్నర్ సుయాష్‌ని యుజ్వేంద్ర చాహల్‌లా వాడుకును అవకాశం ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, స్వప్నిల్ సింగ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.

ఇంపాక్ట్ ప్లేయర్: స్వస్తిక్ చికారా/సుయాష్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి స్క్వాడ్..

ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, స్వప్నిల్ సింగ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, స్వస్తిక్ చికారా, సుయాష్ శర్మ, దేవదత్ పడిక్కల్, రొమారియో షెపర్డ్, జాకూబ్ భంథేల్, , మోహిత్ రాఠీ, రసిఖ్ దార్, నువాన్ తుషార, లుంగి ఎన్గిడి, అభినందన్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

RCB Playing XI: కెప్టెన్ లేకుండా ఫిక్స్ అయిన ఆర్సీబీ ప్లేయింగ్ 11
RCB Playing XI: కెప్టెన్ లేకుండా ఫిక్స్ అయిన ఆర్సీబీ ప్లేయింగ్ 11
రూ.30 వేలలోనే లభిస్తున్న బెస్ట్ 8 జీబీ స్మార్ట్ ఫోన్లు
రూ.30 వేలలోనే లభిస్తున్న బెస్ట్ 8 జీబీ స్మార్ట్ ఫోన్లు
ఈ నటి సినిమాల్లో ఫ్లాప్.. లైఫ్‌లోనూ ఫెయిల్యూర్.. మూడు పెళ్లిళ్లు
ఈ నటి సినిమాల్లో ఫ్లాప్.. లైఫ్‌లోనూ ఫెయిల్యూర్.. మూడు పెళ్లిళ్లు
ఈ లక్షణాలు కనిపించినా.. మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్టే!
ఈ లక్షణాలు కనిపించినా.. మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్టే!
తక్కువ పోటీ.. ఎక్కువ లాభాలు.. లక్షలు సంపాదించే వ్యాపారం..
తక్కువ పోటీ.. ఎక్కువ లాభాలు.. లక్షలు సంపాదించే వ్యాపారం..
ఐపీఓ బాటలో ఆ పది కంపెనీలు.. రూ. 20 వేల కోట్ల సేకరణే టార్గెట్
ఐపీఓ బాటలో ఆ పది కంపెనీలు.. రూ. 20 వేల కోట్ల సేకరణే టార్గెట్
స్వాతంత్ర్య పోరాట కాలం నాటి వంతెన.. ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కే
స్వాతంత్ర్య పోరాట కాలం నాటి వంతెన.. ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కే
ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇక చూస్తారుగా కీర్తి సురేష్ గ్లామర్ షో..!
ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇక చూస్తారుగా కీర్తి సురేష్ గ్లామర్ షో..!
లంకలో బీభత్సం.. కట్చేస్తే.. రూ. 1.20 కోట్లు ఖర్చు చేసిన కావ్యపాప
లంకలో బీభత్సం.. కట్చేస్తే.. రూ. 1.20 కోట్లు ఖర్చు చేసిన కావ్యపాప
చిన్న మొత్తాల పొదుపుతో పెద్ద మొత్తంలో రాబడి
చిన్న మొత్తాల పొదుపుతో పెద్ద మొత్తంలో రాబడి
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.