IPL 2025: లంకలో బీభత్సం.. కట్చేస్తే.. రూ. 1.20 కోట్లు ఖర్చు చేసిన కావ్య మారన్.. అసలెవరీ ఇషాన్ మలింగ?

IPL 2025 Auction: ఇషాన్ మలింగ ఇప్పటి వరకు 13 టీ20 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. ఈ ఫార్మాట్‌లో అతని ఎకానమీ 7.35గా ఉంది. అతను 12 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 20 వికెట్లు, 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 39 వికెట్లు సాధించాడు. ఇషాన్ ఈ ఏడాది చెన్నైలోని MRF పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందాడు. చమిందు విక్రమసింఘే పర్యవేక్షణలో ఇక్కడ శిక్షణ పొందాడు.

IPL 2025: లంకలో బీభత్సం.. కట్చేస్తే.. రూ. 1.20 కోట్లు ఖర్చు చేసిన కావ్య మారన్.. అసలెవరీ ఇషాన్ మలింగ?
Eshan Malinga
Follow us
Venkata Chari

|

Updated on: Nov 26, 2024 | 3:51 PM

IPL 2025 Auction: ఐపీఎల్ 2025 వేలంలో శ్రీలంక యువ ఫాస్ట్ బౌలర్ ఇషాన్ మలింగను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంచుకుంది. 1.20 కోట్లకు కొనుగోలు చేశారు. ఇషాన్ ఫాస్ట్ బౌలర్, ఐపీఎల్‌లో మొదటిసారి ఆడనున్నాడు. వీరిని ఎంపిక చేసేందుకు జట్ల మధ్య పోటీ కూడా నెలకొంది. ఇషాన్ మలింగ అంతర్జాతీయ స్థాయిలో శ్రీలంక తరపున ఇంకా ఆడలేదు. కానీ, జూనియర్ స్థాయిలో ఆడుతూ తనదైన ముద్ర వేశాడు. ఇషాన్ మలింగ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇషాన్ రూ.30 లక్షల బేస్ ధరతో వేలంలోకి అడుగుపెట్టాడు. అతడి కోసం హైదరాబాద్‌ తొలిసారిగా వేలంలో నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్ కూడా రంగంలోకి దిగింది. ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో మలింగ వేలం కోటి రూపాయలు దాటింది. ఆ తర్వాత హైదరాబాద్ రూ.1.20 కోట్ల పందెం కాసింది. దీంతో రాజస్థాన్ వైదొలిగింది. దీంతో 23 ఏళ్ల ఇషాన్ మలింగ హైదరాబాద్ జట్టులో భాగమయ్యాడు. అతను 2016 ఛాంపియన్ జట్టుకు 19వ ఆటగాడిగా నిలిచాడు.

శ్రీలంక ఏ తరపున ఇషాన్ అద్భుతాలు..

ఇషాన్ మలింగ లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అతను కొంతకాలంగా శ్రీలంక ఏ జట్టులో కూడా ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎమర్జింగ్ టీమ్‌ల టీ20 ఆసియా కప్‌లోనూ ఆడాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు తీశాడు. హాంకాంగ్‌పై 20 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన. ప్రస్తుతం శ్రీలంక ఏ జట్టుతో కలిసి పాకిస్థాన్‌లో పర్యటిస్తున్నాడు. ఇక్కడ తొలి 50 ఓవర్ల మ్యాచ్‌లో 61 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

ఇషాన్ మలింగ కెరీర్ ఎలా ఉంది?

ఇషాన్ మలింగ ఇప్పటి వరకు 13 టీ20 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. ఈ ఫార్మాట్‌లో అతని ఎకానమీ 7.35గా ఉంది. అతను 12 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 20 వికెట్లు, 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 39 వికెట్లు సాధించాడు. ఇషాన్ ఈ ఏడాది చెన్నైలోని MRF పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందాడు. చమిందు విక్రమసింఘే పర్యవేక్షణలో ఇక్కడ శిక్షణ పొందాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..