తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉంచడంలో గుడ్డు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ ఏ, బి12 రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
శరీరానికి ఇన్‌స్టాంట్ శక్తిని అందించడంలో గుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు తక్షణ శక్తిని అందిస్తాయి.
గుడ్లలో కోలిన్ అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది హోమోసిస్టీన్‌ను విచ్ఛిన్నం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.
గర్భిణీలు కచ్చితంగా రోజుకో గుడ్డు తినాలని నిపుణులు చెబుతుంటారు. ఇందులోని ఫోలిక్ యాసిడ్ స్పైనా బిఫిడా వంటి పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది.
కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా గుడ్డు ఉపయోగపడుతుంది. ఇందులోని లుటిన్‌తో పాటు ఇతర విటమిన్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారు రోజుకో గుడ్డును కచ్చితంగా తీసుకోవాలి. ఉదయం టిఫిన్‌గా గుడ్డును తీసుకుంటే ఇట్టే బరువు తగ్గుతారు.
మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు మెదడు, నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడతాయి.
పైన తెలిపిన విషయాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.