Vastu Tips: రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు.!
ప్రస్తుతం మనిషి జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. తెల్లవారిలేస్తే అంతా హడావిడి...ఉరుకుల పరుగుల జీవితంలో ఏ పనులు ఎప్పుడు చేయాలో.. ఎప్పుడు చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడానికి లేదా ఇంట్లో వస్తువులను ఉంచడానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అలా అని వీటిని మూఢనమ్మకాలు అనుకోవద్దు.
ఆరోగ్యం, కుటుంబం జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తిని తెచ్చేందుకేనని నిపుణులు చెబుతున్నారు. కనుక ఇంట్లో వివిధ వస్తువులను ఎక్కడ ఉంచాలి, ఏ పరిమాణంలో ఉండాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ నిబంధనలలో బట్టలు ఉతకడానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి.
వాస్తు ప్రకారం మురికి బట్టలు ఉతకడానికి కూడా ఓ సమయం ఉంది. బట్టలను రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతకరాదని, పగలు మాత్రమే ఉతకాలంటున్నారు వాస్తు నిపుణులు. అయితే ఉదయం హడావిడిగా ఉద్యోగానికి వెళ్ళే వారు రాత్రి సమయంలో అన్ని పనులను పూర్తి చేసుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలోనే బట్టలు రాత్రుళ్లు ఉతుకుతుంటారు. ఇలా రాత్రి సమయంలో ఉతికిన బట్టలు ధరించడం అనారోగ్యకరమని, అశుభమని అంటున్నారు. ఎందుకంటే .. రాత్రి సమయంలో బట్టలు ఉతికితే.. ఆ తడి బట్టలు ఆరు బయట ఆరబెట్టకూడదు. ఇది ఆనందం, శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుందట. బట్టలను ఎప్పుడూ సూర్యదయం తర్వాత మాత్రమే ఉతకాలట. ఉతికిన బట్టలను సూర్యరశ్మిలో ఆరబెట్టాలట. ఎండలో బట్టలను అరబెట్టడం వలన ప్రతికూల శక్తి పోతుందట. అంతేకాదు ఎండలో ఆరబెట్టిన బట్టల్లో ఉండే హానికరమైన క్రిములు కూడా నాశనం అవుతాయి. అలా ఎండలో ఆరబెట్టిన దుస్తులు ధరించినప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం.. శరీరంలో పాజిటివ్ ఎనర్జీ కూడా ప్రసారం అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో ప్రతికూల శక్తి పుష్కలంగా ఉంటుందట. రాత్రి బట్టలు ఉతకడం, బయట ఆరబెట్టడం వల్ల బట్టల్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అంతేకాదు చల్లదనానికి బట్టల్లోకి క్రిములు చేరతాయట. చల్లదనంలో ఆరబెట్టిన బట్టలను ధరించడం ఆరోగ్యానికి హానికరం. ప్రతికూల శక్తి శరీరానికి ఏ విధంగానూ మంచిది కాదంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

