AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: హమ్మయ్యా! పుష్ప 2 షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక ఆ రూమర్లకు చెక్‌ పడినట్టే

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పై కీలక అప్డేట్ ఇచ్చాడు బన్నీ.

Pushpa 2: హమ్మయ్యా! పుష్ప 2 షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక ఆ రూమర్లకు చెక్‌ పడినట్టే
Pushpa 2 Movie
Basha Shek
|

Updated on: Nov 26, 2024 | 7:41 PM

Share

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ రిలీజ్ కానుంది. అయితే పుష్ప 2 సినిమాపై నెట్టింట బోలెడు రూమర్లు వినిపిస్తున్నాయి. పుష్ప 2 సినిమా షూట్ ఇంకా చాలా ఉందని, ఒక పాట, నాలుగు రోజులు షూట్ బ్యాలెన్స్ ఉందని, డైరెక్టర్ సుకుమార్ ఈ పనుల్లోనే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే సుక్కూ ప్రమోషన్లలో పాల్గొనడం లేదని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఒక్క ఒక పోస్టుతో ఈ రూమర్లకు పూర్తిగా చెక్ పెట్టేశాడు అల్లు అర్జున్. పుష్ప 2 షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘లాస్ట్ డే లాస్ట్ షాట్ ఆఫ్ పుష్ప. ఐదేళ్ల ఈ ప్రయాణం పూర్తయింది. వాట్ ఏ జర్నీ’ అని అల్లు అర్జున్ పోస్ట్ పెట్టగా అది కాస్తా వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక రిలీజ్ డేట్ గురించి ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.

కాగ పుష్ప 2 ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ సహా అన్ని పనులు పూర్తయ్యాయని టాక్. మరో రెండు రోజుల్లో సెకండాఫ్ కూడా ఎడిటింగ్ పూర్తవుతుందని సమచారం. ఇదిలా ఉంటే పుష్ప 2 రన్ టైమ్ కూడా లాక్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమా సుమారు 3 గంటల 21 నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రానుంది.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ పోస్ట్..

కాగా ‘పుష్ప’ సినిమా 2021 డిసెంబరు 17న రిలీజై సంచలనం సృష్టిచింది. దాదాపు మూడేళ్ల తర్వాత ‘పుష్ప 2’ విడుదల కానుంది. ఇప్పటికే ఈ క్రేజీ సీక్వెల్ కు రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగినట్లు టాక్.

రేపు కొచ్చిలో పుష్ప 2 ఈవెంట్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్ ఎంపరర్ హోటల్ కింద నిధి? కోట్ల విలువైన బంగారు ఇటుకలు..
గ్రాండ్ ఎంపరర్ హోటల్ కింద నిధి? కోట్ల విలువైన బంగారు ఇటుకలు..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు..ఛార్జీలు
గుడ్‌న్యూస్‌.. మళ్లీ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు..ఛార్జీలు
భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో..?
భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో..?
గోవా వెళ్తున్నారా..? ఇది చేస్తే 24 గంటల పాటు జైలుశిక్ష
గోవా వెళ్తున్నారా..? ఇది చేస్తే 24 గంటల పాటు జైలుశిక్ష
సౌందర్య స్టార్ హీరోయిన్.. అయినా ఆ సీన్ కోసం అలా చేసింది..
సౌందర్య స్టార్ హీరోయిన్.. అయినా ఆ సీన్ కోసం అలా చేసింది..
టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు చుక్కలే
టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు చుక్కలే
ముక్క ముట్టని పెద్ద పులి.. కేవలం ద్రవాహారం మాత్రమే.. ఎందుకంటే
ముక్క ముట్టని పెద్ద పులి.. కేవలం ద్రవాహారం మాత్రమే.. ఎందుకంటే
అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?
అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?
సీరియల్స్ మానేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే..
సీరియల్స్ మానేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే..
'ధురంధర్' సినిమాకు అదే పెద్ద మైనస్.. ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
'ధురంధర్' సినిమాకు అదే పెద్ద మైనస్.. ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్