ఆ పాడు పని చేసిన మహిళా టీచర్‌కు.. 30 ఏళ్ల జైలు శిక్ష

ఆ పాడు పని చేసిన మహిళా టీచర్‌కు.. 30 ఏళ్ల జైలు శిక్ష

Phani CH

|

Updated on: Nov 26, 2024 | 7:13 PM

ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చేలా ఓ మహిళా టీచర్ పనిచేసింది. పాఠాలు చెప్పాల్సిన విద్యార్థులతోనే రాసలీలలకు దిగింది. స్పెషల్‌ క్లాస్‌ల పేరుతో శృంగార క్లాస్‌లు తీసుకుంది. దీంతో ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆ విద్యార్థి కేవలం 8వ తరగతి కావడం గమనార్హం. 30 ఏళ్ల ఆ టీచర్ విద్యార్థితో సంబంధం పెట్టుకుని చివరికి అడ్డంగా దొరికిపోయింది.

ఈ సంఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ మాజీ మ‌హిళా టీచ‌ర్‌కు 30 ఏళ్ల జైలుశిక్ష ఖ‌రారైంది. ఓ టీనేజ్ విద్యార్థితో ప‌లుమార్లు శృంగారంలో పాల్గొన్న కేసులో ఈ శిక్ష‌ను విధించారు. మెలిసా క‌ర్టిస్ అనే 32 ఏళ్ల టీచ‌ర్‌కు థర్డ్ డిగ్రీ సెక్స్ అఫెన్స్ కింద శిక్ష వేశారు. శిక్షాకాలం పూర్తి అయిన త‌ర్వాత క‌ర్టిస్ కు మ‌రిన్ని ఆంక్ష‌లు విధించారు. కేవ‌లం త‌న పిల్ల‌లు త‌ప్ప మైన‌ర్ల‌కు ఆమెను దూరంగా పెట్టాల‌ని ఆదేశించారు. 8వ గ్రేడ్ విద్యార్థికి మ‌ద్యంతో పాటు మారిజోనా మ‌త్తుప‌దార్ధాన్ని ఇచ్చి.. ఆ కుర్రాడితో టీచ‌ర్ శృంగారంలో పాల్గొన్న‌ది. సుమారు 20 సార్లు ఆమె శృంగారంలో పాల్గొన్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది. స్కూల్ టైం ముగిసిన త‌ర్వాత స్పెష‌ల్ క్లాసు పేరుతో ఇద్ద‌రు మాత్ర‌మే ఉండేవార‌ని ప్రాసిక్యూట‌ర్ తెలిపారు. అక్టోబ‌ర్ 2023లో ఈ కేసు విచార‌ణ మొద‌లైంది. నేరం రుజువు కావడంతో టీచర్‌కు ఏకంగా 30 ఏళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి భర్తను కాపాడుకున్న భార్య

నువ్వు దేవుడయ్యా సామీ !! రూ.కోటితో బిచ్చగాడు విందు

గర్ల్ ఫ్రెండ్ కోసం 11 వారాలు ఫ్లైట్ జర్నీ.. దేశాలే దాటేశాడుగా

ఈ ఉద్యోగం వెరీ స్పెషల్‌.. కండిషన్స్‌ అప్లై

బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.84 కే ఇళ్ల అమ్మకం !!