25 November 2024
Subhash
మన జీవితంలో ఆధార్ కార్డు ముఖ్య పాత్ర పోషిస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. ఆధార్ లేనిది ఏ పని జరగదు.
ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి. మరి ఒక మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్‌లను లింక్ చేయవచ్చో తెలుసా?
మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్ కార్డు నంబర్‌లను అనుసంధానం చేయవచ్చనే దానిపై ఎటువంటి పరిమితి లేదు.
అయితే మీ స్వంత మొబైల్ నంబర్ లేదా మీరు సురక్షితమని భావించే నంబర్‌తో ఆధార్‌ను లింక్ చేయాలని UIDAI సిఫార్సు చేస్తుంది.
ఎందుకంటే లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీ ఆధారంగా మీ ఆధార్‌కు రక్షణగా ఉంటుంది.
ఆధార్ ఆధారంగా జరిగే ఏదైనా ఆన్‌లైన్ లావాదేవీకి ప్రామాణీకరణ కోసం ఓటీపీ అవసరం. మీరు మీ లింక్ ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీని అందుకుంటారు.
అందుకే ఆధార్ కార్డుకు లింక్ చేయబడిన ప్రైమరీ మొబైల్ నంబర్ చాలా ముఖ్యమైనదని గుర్తించుకోండి.
డిజిటల్ సేవల విషయంలో మీ ఓటీపీ మీకు భద్రతతో పాటు ప్రమాణీకరణను అందిస్తుందని గుర్తుంచుకోండి.