Viral Video: ఓరి నీ పిచ్చి తగలెయ్య..! ఏకంగా మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. కట్ చేస్తే.. గుండెలు అదిరే వీడియో..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఫన్నీ వీడియోలు తెరపైకి వస్తే.. మరి కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన వీడియోలు కనిపిస్తుంటాయి.

Viral Video: ఓరి నీ పిచ్చి తగలెయ్య..! ఏకంగా మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. కట్ చేస్తే.. గుండెలు అదిరే వీడియో..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 14, 2022 | 10:58 AM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఫన్నీ వీడియోలు తెరపైకి వస్తే.. మరి కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన వీడియోలు కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి మొసలితో ఆడుకుంటున్నాడు. ఈ షాకింగ్ వీడియోను చూసి.. చాలామంది నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతోపాటు.. మొసలితో అలాగేనా వ్యవహరించేంది.. ప్రాణాలు పోతాయంటూ హెచ్చరిస్తున్నారు.

ఓ వ్యక్తి మొసలి వెనుక కూర్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇందులో అతని ముఖం ప్రమాదకరమైన మొసలి దంతాల పైన ఉంటుంది. వీడియో చాలా భయానకంగా కనిపిస్తోంది. కానీ ఆ వ్యక్తి దానితో ఆడుకుంటుంటాడు. ఈ సమయంలో చాలామంది అతిని ప్రదర్శనను ఆసక్తికరంగా వీక్షిస్తుంటారు. మొసలి నోరు తెరిచి ఉండగా.. పళ్ళ పైన తన ముఖాన్ని ఉంచి.. నెమ్మదిగా తన చేతిని పైకి లేపుతాడు.

ఇవి కూడా చదవండి

తర్వాత చాలా జాగ్రత్తగా మొసలి దవడల మధ్య తన చేతిని కదపడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతను మొదట తన కుడి చేతిని మొసలి కన్నుపై ఉంచి, ఆపై ఎడమ చేతిని దంతాల మధ్యకు తీసుకువస్తాడు. అయితే.. ఆ వ్యక్తి ఒక్క సెకను మాత్రమే అలా చేస్తాడు.. మొసలి మాత్రం బుల్లెట్ వేగంతో చేతిని కరకరా నమిలేసేందుకు ప్రయత్నిస్తుంది.

వీడియో చూడండి..

వీడియోలో ఈ దృశ్యం చూసి నెటిజన్లు కూడా చాలా భయపడ్డారు. ప్రమాదకరమైన జీవి చేతిని పట్టుకుందని అనుకుంటారు.. కానీ, కానీ ఆ వ్యక్తి వాయు వేగంతో చేతిని బయటకు తీస్తాడు. దీంతో ప్రమాదం తప్పుతుంది. అయితే, ఆ వ్యక్తి స్పీడ్‌ని చూసి అక్కడున్న వారు ప్రశంసిస్తూ కనిపించారు. ఈ వీడియో ఓ జంతు ప్రదర్శనశాలకు సంబంధించినదిగా పేర్కొంటున్నారు. నెటిజన్లు మాత్రం దీనిని చూసి షాకవుతూ.. ప్రమాదకర జంతువులతో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం..