Rohith Reddy: ఈడి కార్యాలయానికి తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.. వీటిపైనే అధికారుల సూటి ప్రశ్నలు..
నాటకీయ పరిణామాల మధ్య ఈడీ విచారణకు హాజరయ్యారు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌లో విచారణ సాగుతోంది.
ఎట్టకేలకు బీఆర్‌ఎస్ తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌లో విచారణ సాగుతోంది. అంతకు ముందు ఇంటి నుంచి బయలు దేరిన రోహిత్ రెడ్డి.. నేరుగా ఈడీ ఆఫీస్‌లోకి వెళ్లిపోయారు. అంతకు ముందు తనకు గడువు కావాలన్న రోహిత్‌రెడ్డి విజ్నప్తిని తిరస్కరించింది ఈడీ. విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. మొత్తం 10 అంశాలపై రోహిత్‌రెడ్డిని విచారించనుంది ఈడీ. ఉదయం ఇంటి నుంచి ఈడీ విచారణకు బయల్దేరిన రోహిత్ రెడ్డి సడెన్‌గా ప్రగతిభవన్‌కు వెళ్లారు. రాహుకాలం ముగిసింది. విచారణకు వెళ్తున్నానంటూ కామెంట్ చేసిన.. అంతలోనే రూట్ మార్చారు. మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. ఈడీ విచారణకు వెళతారనుకున్న రోహిత్ రెడ్డి సడెన్‌గా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమై చర్చించారు. ఈడీ విచారణ నేపథ్యంలో న్యాయ సలహాలపై డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
ఇవాళ ఉదయం నుంచి జరిగిన..
ఇక తాను అయ్యప్పమాలలో ఉన్న కారణంగా..ఈ నెల 31వరకు హాజరుకాలేనన్న ఈడీకి లేఖ రాశారు రోహిత్‌రెడ్డి. తన PAతో ఈడీ అధికారులకు లేఖ పంపించారు. వివరాల సేకరణకు సమయం కావాలని.. తనకు ఇంకా అకౌంట్ స్టేట్‌మెంట్స్, బ్యాంక్ వివరాలు అందలేదని వివరణ ఇచ్చారు.
మరోవైపు రోహిత్‌రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. తాను డ్రగ్స్ తీసుకోవడం లేదని కానీ, బెంగళూరు కేసుతో సంబంధం లేదని కానీ రోహిత్‌రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. అయ్యప్ప మాలలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. ఆయన మాల తీసేసిన తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడతానన్నారు రఘునందన్‌రావు.
రోహిత్‌రెడ్డికి నోటీసులు..
ఇక పీఎంఎల్ఏ కింద రోహిత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ.. తనతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తీసుకురావాలని ఆదేశించింది. ఆధార్, పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్‌తో పాటు..సేల్ డీడ్, ఇన్వాయిస్ కాపీలు కూడా తేవాలని కోరింది. ఆస్తుల కొనుగోలుకు సంబంధించి సోర్స్ ఆఫ్ ఫండ్ వివరాలు..రోహిత్ పేరుపై ఉన్న కంపెనీలు, ఫరమ్స్, ట్రస్ట్‌ల వివరాలు కూడా కోరింది. 2015 నుంచి బ్యాలెన్స్ షీట్స్, కంపెనీల స్థిర చరాస్తులతో పాటు లోన్స్, లోన్ అగ్రిమెంట్స్ వివరాలు కూడా తీసుకురావాలని ఆదేశించింది.
మరోవైపు ఇప్పటికే ఈడీ ఇచ్చిన నోటీసులపై ఏం చేయాలనే విషయంపై తన లాయర్‌తో డిస్కస్ చేశారు రోహిత్ రెడ్డి. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలనే విషయంపై చర్చించారు.
డ్రగ్స్ కేసు రీ ఓపెనింగ్..
ఇటీవల కర్ణాటక డ్రగ్స్ కేసు రీ ఓపెనింగ్ విషయమై వాడీ వేడీ చర్చ జరుగుతోంది. బండి సంజయ్ కామెంట్స్‌కు BRS లీడర్లు కౌంటర్లు వేయడం..ఆ వెంటనే ఈడీ నోటీసులివ్వడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ఆ తర్వాత భాగ్యలక్ష్మి టెంపుల్‌కు వెళ్లిన రోహిత్‌రెడ్డి..బండి సంజయ్ రాలేదు కాబట్టి ఆయన తనపై తప్పుడు ఆరోపణలు చేశారని స్పష్టమైపోయిందన్నారు.
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లోనే ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ జరిగింది. మరోవైపు బెంగళూరు డ్రగ్స్‌కేసులో రోహిత్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఫామ్‌హౌస్ కేసులో ఇటీవలే రోహిత్‌రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ టైమ్‌లో ఈడీ రోహిత్‌రెడ్డిని విచారణకు పిలవడంపై ఉత్కంఠ నెలకొంది. రోహిత్‌రెడ్డిని వ్యాపార లావాదేవీలపై కూడా ప్రశ్నించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం