AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google CEO: మోదీజీ.. మీ నాయకత్వం సూపర్..! భారత్ వేగంగా మారుతోందంటూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌లో వేగంగా మార్పులు వస్తున్నాయని ప్రశంసలతో ముంచెత్తారు.

Google CEO: మోదీజీ.. మీ నాయకత్వం సూపర్..! భారత్ వేగంగా మారుతోందంటూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రశంసలు
Google CEO Sundar Pichai Meets PM Modi
Sanjay Kasula
|

Updated on: Dec 19, 2022 | 9:16 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఢిల్లీలో కలిశారు. సాంకేతికత, ఆవిష్కరణలు సహా పలు అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. సమావేశ వివరాలు సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.. జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహించడాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో తాము భారత్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో సాంకేతికపరమైన మార్పులు వేగంగా జరుగుతున్నాయని ప్రశంసించారు.

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ, పిచాయ్ ట్వీట్ చేశారు: “ఈరోజు జరిగిన గొప్ప సమావేశానికి ధన్యవాదాలు PM @narendramodi. మీ నాయకత్వంలో సాంకేతిక మార్పుల వేగవంతమైన వేగాన్ని చూడడానికి స్ఫూర్తినిస్తోంది. మా బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి , భారతదేశం G20 అధ్యక్ష పదవికి మద్దతుగా ముందుకు సాగడానికి ఎదురుచూస్తున్నాం. అందరికీ పని చేసే ఓపెన్, కనెక్ట్ చేయబడిన ఇంటర్నెట్.”

ఐటీ మంత్రిని కూడా కలిశారు

గూగుల్ ఫర్ ఇండియా 8వ ఎడిషన్‌కు హాజరయ్యేందుకు భారత్ వచ్చిన సుందర్ పిచాయ్ సమాచార, సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా కలిశారు. ఈ సమయంలో, భారతదేశంలో AI, AI ఆధారిత పరిష్కారాల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిగిన సంభాషణలో పిచాయ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నదాన్ని సృష్టించడం చాలా సులభం, ఇది భారతదేశానికి ఉన్న అవకాశం. మేము ప్రస్తుతం స్థూల-ఆర్థిక పరిస్థితిలో పనిచేస్తున్నప్పటికీ, ప్రతి క్షణం స్టార్టప్‌కు మంచి క్షణమే.

భారతీయుల ప్రతిభకు చిహ్నం..

మరోవైపు, సుందర్ పిచాయ్​ను.. భారతీయుల ప్రతిభకు చిహ్నంగా అభివర్ణించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్​లో సుందర్​తో భేటీ అయిన రాష్ట్రపతి ముర్ము.. భారత్​లో ప్రజలందరూ డిజిటల్ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేయాలని ఆయనకు పిలుపునిచ్చారు.

గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారత్​కు వచ్చారు సుందర్ పిచాయ్. స్టార్టప్​లకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారత స్టార్టప్​లలో 300 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు గూగుల్ ఇదివరకు ప్రకటించింది. ఇందులో నాలుగో వంతు మహిళలు నాయకత్వం వహిస్తున్న స్టార్టప్​లలో పెట్టుబడులు పెట్టనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం