Hair Care Tips: జుట్టు సమస్యలకు బియ్యం పిండితో పరిష్కారం.. ఇలా చేస్తే మంచి నిగారింపు మీ సొంతం..

బియ్యం పిండి జుట్టుకు బలం చేకూర్చడమే కాకుండా జుట్టు రాలడం అనే సమస్యను దూరం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. మీరు మీ జుట్టును కండిషన్ చేయాలనుకుంటే,

Hair Care Tips: జుట్టు సమస్యలకు బియ్యం పిండితో పరిష్కారం.. ఇలా చేస్తే మంచి నిగారింపు మీ సొంతం..
Hair Care Tips
Follow us

|

Updated on: Dec 19, 2022 | 9:07 PM

జుట్టు సంరక్షణకు వయసుతో సంబంధం లేకుండా అందరూ అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. జుట్టు పొడవుగా, మందంగా, నల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మీరు మీ జుట్టు సంరక్షణ చర్యలో బియ్యం పిండిని చేర్చుకుంటే, అది మీ జుట్టుకు నిగారించే మెరుపునిస్తుంది. అంతేకాదు..జుట్టు ఒత్తుగా పెరిగేందుకు, సహజంగా దృఢంగా మారుస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు జుట్టు కోసం బియ్యం పిండి ప్రయోజనాలు ఏంటో తెలుసుకోవాలి. ఈ రోజు మనం ఈ కథనంలో మీ జుట్టుకు బియ్యం పిండిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

బియ్యప్పిండిని వాడితే స్కాల్ప్ కు క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. మూలాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు జుట్టు పెరగాలని కోరుకుంటే లేదా మీ జుట్టు చాలా కాలం పాటు నిగారింపుతో ఉండాలని కోరుకుంటే, మీరు బియ్యం పిండిని ఉపయోగించవచ్చు. రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతుంటే బియ్యప్పిండి వాడవచ్చు. బియ్యం పిండి జుట్టుకు బలం చేకూర్చడమే కాకుండా జుట్టు రాలడం అనే సమస్యను దూరం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. మీరు మీ జుట్టును కండిషన్ చేయాలనుకుంటే, మీరు కండిషనింగ్ కోసం బియ్యం పిండిని ఉపయోగించవచ్చు. ఇది సహజ బలాన్ని ఇవ్వడమే కాకుండా జుట్టును మెరిసేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి