- Telugu News Photo Gallery Bhojpuri Actress Monalisa Posted her Red Saree photos on Instagram As she ready for Christmas celebrations
Monalisa: అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్న భోజ్‌పురి నటి.. వైరల్ అవుతున్న మోనాలీసా ఫోటోలు..
భోజ్‌పురి నటి మోనాలిసా సోషల్ మీడియాలో తనదైన శైలీలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఎర్రని చీరలో ఉన్న మోనాలిసా చాలా అందమైన ఫోటోలను షేర్ చేసింది. తన కవ్వించే చూపులతో ఉన్న ఆ ఫోటోలు అభిమానులను పిచ్చెక్కించేలా ఉన్నాయి..
Updated on: Dec 20, 2022 | 2:04 PM

తన బోల్డ్ లుక్‌లతో సోషల్ మీడియా ఉష్ణోగ్రతను పెంచే నటి మోనాలిసా. రెడ్ చీరలో ఉన్న తన ఫోటోలను మోనాలిసా షేర్ చేయడంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మోనాలిసా ఈ ఫోటోలను షేర్ చేస్తూ- ‘క్రిస్మస్ వైబ్స్’ అనే కాప్షన్ రాసుకొచ్చింది ఈ భోజ్‌పురీ నటి.

రెడ్ నెట్ చీరను ధరించిన మోనాలిసా ఫుల్ స్లీవ్ బ్లౌజ్‌తో పాటు కనిపించింది. ఇక ఉంగరాల జుట్టు, చెవిపోగులు మోనాలిసా అందాన్ని మరింతగా పెంచాయని చెప్పుకోవాలి. ఆమె మెడలో ఉన్న నెక్‌లెస్ కూడా ఆకర్షణీయంగా ఉంది.

నుదుటిపై ఎర్రటి బిందీతో ఉన్న మోనాలిసా ఆకర్షణీయమైన లుక్‌లు అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి. ఇక మోనాలిసా ఫోటోలపై నెటిజన్లు ఘటైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

40 ఏళ్ల వయసులో కూడా మోనాలిసా తన అందాలతో అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది. వెస్ట్రన్- ఇండియన్ లుక్‌లో చాలా అందంగా ఉన్న ఆమె ఎరుపు రంగు చీరలో అద్భుతంగా ఉంది.

కోట్లాది మంది అభిమానులకు పిచ్చెక్కించే మోనాలిసా.. భోజ్‌పురిలో అగ్ర నటి. ఆ కారణంగానే ఆమె తన ఫోటోలు షేర్ చేసిన వెంటనే మిలియన్ల కొద్దీ కామెంట్స్, లైక్స్ వచ్చాయి.
