AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీరు స్మార్ట్‌ఫోన్‌ను వదిలేయాల్సిన సమయం వచ్చినట్లే..

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవితాల్లో స్మార్ట్‌ఫోన్‌ ఓ భాగమైపోయింది. స్కూలుకి వెళ్లే చిన్నారుల నుంచి రిటైర్డ్‌ అయిన ఉద్యోగుల వరకు ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతున్న రోజులివీ. ఉదయం నిద్ర లేవడమే మొదలు స్మార్ట్‌ఫోన్‌ను పట్టుకోవడంతోనే రోజును మొదలు పెడుతున్నారు. ప్రతీ చిన్న పనికి...

Smartphone: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీరు స్మార్ట్‌ఫోన్‌ను వదిలేయాల్సిన సమయం వచ్చినట్లే..
Smartphone
Narender Vaitla
|

Updated on: Dec 20, 2022 | 6:10 PM

Share

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవితాల్లో స్మార్ట్‌ఫోన్‌ ఓ భాగమైపోయింది. స్కూలుకి వెళ్లే చిన్నారుల నుంచి రిటైర్డ్‌ అయిన ఉద్యోగుల వరకు ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతున్న రోజులివీ. ఉదయం నిద్ర లేవడమే మొదలు స్మార్ట్‌ఫోన్‌ను పట్టుకోవడంతోనే రోజును మొదలు పెడుతున్నారు. ప్రతీ చిన్న పనికి కూడా స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారడం దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు. అయితే స్మార్ట్‌ ఫోన్‌ వల్ల ప్రయోజనాలు ఉన్నట్లే, అనర్థాలు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ను అతిగా ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మీలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తుంటే స్మార్ట్ ఫోన్‌ ప్రభావం మీపై ఉన్నట్లే. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..

* ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్‌ స్థాయిలు ఉదయం తక్కువగా ఉంటాయి. అందుకే ఉదయం లేవగానే ఫ్రెష్‌గా ఉంటాయి. అయితే ఉదయం నిద్ర లేవగానే స్మార్ట్‌ఫోన్‌ను పట్టుకుంటే ఒత్తిడి స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే ఒత్తిడిగా ఫీలవుతుంటే స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టాల్సిందేనని గుర్తుంచుకోండి.

* ఏ కారణం లేకుండా తలనొప్పి వస్తుంటే అది కూడా గ్యాడ్జెట్ అతి వినియోగం లక్షణమేనని అర్థం చేసుకోవాలి. గ్యాడ్జెట్‌ల వినియోగం కారణంగా ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లు విడుదలవుతాయి. దీని కారణంగా తలనొప్పి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

* ఇక గ్యాడ్జెట్ల అతి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభాల్లో మెడ నొప్పి ఒకటి. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం అది వెన్నెముకపై ప్రభావం పడుతుంది. దీంతో మెడ నొప్పితో పాటు నడుము నొప్పి వంటి సమస్యలు వేధిస్తుంటాయి.

* గ్యాడ్జెట్లను అతిగా వాడడం వల్ల భుజం నొప్పి వేధిస్తుంటుంది. ఒకే పొజిషన్‌లో గంటలతరబడి కూర్చోవడం, చేతులను పెద్దగా కదిలించకపోవడం కారణంగా ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. పైన తెలిపిన ఏ లక్షణాలు కనిపిస్తున్నా మీరు గ్యాడ్జెట్లను అతిగా ఉపయోగిస్తున్నారనే అర్థం.

ఈ చిట్కాలు పాటించండి..

స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. బెడ్‌రూమ్‌కు మొబైల్‌లను దూరంగా పెట్టుకోవాలి. రాత్రి పూట నిద్రపోయే సమయంలో స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్‌నెట్‌ను ఆఫ్‌ చేసి పడుకోవాలి. ఉదయం లేవగానే ఇంటర్‌నెట్‌ను ఆన్‌ చేయకుండా ముఖ్యమైన పనులను పూర్తి చేసుకున్న తర్వాతే ఫోన్‌ను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. రోజులో ఫోన్‌ను ఉపయోగించడానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో కాకుండా మరే ఇతర సమయాల్లోనూ ఫోన్‌ను టచ్‌ చేయకుండా చూసుకోండి. వీటితో పాటు మెడకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేస్తుండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై