- Telugu News Photo Gallery Sports photos Messi won Fifa World Cup, But Why he can not take home original World Cup trophy. Here’s reason
FIFA World Cup Trophy: గెల్చినా.. అర్జెంటీనాకు దక్కని ఫిఫా వరల్డ్ కప్! దీని వెనుక పెద్ద కథే ఉంది..
ఖాతర్ వరల్డ్ కప్-2022 అర్జెంటీనా ఆదివారం (డిసెంబర్ 18) కైవసం చేసుకుంది. దీంతో 36 ఏళ్లుగా ప్రపంచకప్‌ను ముద్దాడాలనే మెస్సి కల తీరినట్లైంది. ఐతే ఇంత పోరాడి కప్ గెలుచుకున్న అర్జెంటీనా ఫీఫా ఒరిజినల్ ట్రోఫీని స్వదేశానికి తీసుకెళ్లడానికి వీలులేదు. అదేంటి.. అని
Updated on: Dec 20, 2022 | 10:14 AM

ఖాతర్ వరల్డ్ కప్-2022 అర్జెంటీనా ఆదివారం (డిసెంబర్ 18) కైవసం చేసుకుంది. దీంతో 36 ఏళ్లుగా ప్రపంచకప్‌ను ముద్దాడాలనే మెస్సి కల తీరినట్లైంది. ఐతే ఇంత పోరాడి కప్ గెలుచుకున్న అర్జెంటీనా ఫీఫా ఒరిజినల్ ట్రోఫీని స్వదేశానికి తీసుకెళ్లడానికి వీలులేదు. అదేంటి.. అని అనుకుంటున్నారా..? ఐతే మీకు ఈ విషయం తెలియాల్సిందే.

ఒరిజినల్ కప్‌కు బదులుగా బంగారు పూత పూసిన కాంస్య నమూనా కప్పు మాత్రమే అర్జెంటీనా సొంతం చేసుకుంది. అసలైన కప్‌ను స్విడ్జర్లాంగ్‌లోని జురిచ్‌లోవున్న ఫిఫీ వరల్డ్ ఫుడ్‌బాల్ మ్యూజియంలో భద్రపరుస్తారట.

నిజానికి.. ఫిఫా ప్రపంచకప్ విజేతలకు ఇచ్చే కప్పును మొదట జూల్స్ రిమెట్ ట్రోఫీగా పిలిచేవాళ్లు.1930 నుంచి ఈ ట్రోఫీలను విజేతలకు ఇచ్చేవాళ్లు. మూడు సార్లు ప్రపంచకప్ గెలిచిన జట్లకు మాత్రమే ఒరిజినల్ ట్రోఫీని అందజేసేవారు. ఈ విధంగా 1970 వరకు కొనసాగింది.

3.8 కిలోల బరువుతో, బంగారు పూతతో ఉండే రిమెట్ ట్రోఫీని విజేతలకు ఇచ్చేవాళ్లు. ఐతే ఇది రెండు సార్లు దొంగతనానికి గురైంది. 1966లో ఒకసారి, 1983లో మరోసారి దొంగతనంగా ఎత్తుకెళ్లారు. మొదటిసారి దొంగిలించినప్పుడు వారం రోజుల్లో గుర్తించారు. రెండోది మాత్రం ఇప్పటివరకూ ఎవరూ గుర్తించలేకపోయారు.

1974 నుంచి రిమెట్ ట్రోఫీ స్థానంలో ఫిఫా ప్రపంచకప్‌ను విజేతలకు అందిస్తున్నారు. దీనిని 36.5 సెం.మీ పొడవు, 6.175 కిలోల బరువు, 4,927 గ్రాములు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. ఈ ప్రపంచ కప్ ట్రోఫీ విలువ 1,61,000 డాలర్లు. ఇంత విలువైన ట్రోఫీని భద్రతాకారణాల రిత్య విజేతలు స్వదేశానికి తీసుకెళ్లడానికి వీల్లేకుండా పోయింది.




